Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా ఆయన నాలుగో పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, పవన్ కళ్యాణ్ మూడో వివాహం కూడా నిలబడదని, భవిష్యత్తులో నాలుగో పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పిన పాత వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతోందన్న సంగతి తెల్సిందే .ఇక ఈ వీడియోని సపోర్ట్ చేస్తూ కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు ట్రోల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యాన్ని మరొక జ్యోతిష్యులు తప్పు బట్టారు. జాతకంలో గురుగ్రహం నీచస్థితిలో ఉండటం వల్లే ఆయన పెళ్లిళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయని వేణుస్వామి చెప్పగా మరో జ్యోతిష్యుడు ఇది తప్పని చెప్పుకొచ్చారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం బలహీనంగా ఉంటే విద్య, ఆర్థిక విషయాలు, గౌరవ మర్యాదలపై ప్రభావం ఉంటుంది తప్ప, కేవలం దానివల్లే పెళ్లి జీవితం దెబ్బతింటుందని చెప్పడం సరికాదని కుండబద్దలు కొట్టేశారు.
పెళ్లి జీవితం బాగుండాలంటే శుక్రగ్రహ స్థితిని చూడాలని, శుక్రుడికి దోషాలు ఉంటేనే దాంపత్య జీవితంలో గొడవలు, విడాకులు వంటివి జరుగుతాయని వివరించారు.
అలాగే కుజ దోషం ఉంటే పెళ్లి లేట్ గా అవడం లేదా ఆటంకాలు రావడం జరుగుతుందని చెప్పారు.అంతేకాకుండా జాతకంలో శుక్రుడు, కుజుడు, శని ఒకే ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ఆడవాళ్ళ విషయంలో స్థిరంగా ఉండడు అనే ప్రచారాన్ని కూడా ఖండించారు .
కేవలం మూడు గ్రహాలు ఒకే చోట ఉన్నంత మాత్రాన అలాంటి నిర్ణయానికి రాకూడదని, అవి ఏ లగ్నానికి అధిపతులు, ఏ స్థానంలో ఉన్నాయి, వాటి బలం ఎంత అనేది ముఖ్యమని తెలిపారు .
ఉదాహరణకు మేష లగ్నానికి పదో స్థానమైన మకర రాశిలో ఈ మూడు గ్రహాలు కలిస్తే అది చాలా గొప్ప రాజయోగం అవుతుందని, దానివల్ల రాజకీయాల్లో ఉన్నత పదవులు, గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని విశ్లేషించారు ..
ఇక పవన్ కళ్యాణ్‌కు నాలుగో పెళ్లి జరుగుతుందన్న ప్రచారంపై స్పందిస్తూ, ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం 2028 వరకు, అలాగే 2029 అక్టోబర్ వరకు కూడా మరో పెళ్లి జరిగే బలమైన సూచనలు ఏవీ కనిపించడం లేదని తేల్చి చెప్పడం విశేషం.
మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళ పేరును పవన్ కళ్యాణ్‌తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై కూడా అసహనం వ్యక్తం చేశారు .
రాజకీయంగా ఆయన ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పుకార్లతో అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్‌కు 2027 మార్చి తర్వాత రాజకీయంగా మరింత మంచి రోజులు వస్తాయని చెప్పడం మరో విశేషం .చూడాలి మరి ఈ జ్యోతిష్యుడు చెప్పిన ఈ మాటలు వచ్చే రోజుల్లో నిజమవుతాయో లేదో !
also read:అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?