Bandla Ganesh Cheque Bounce Case: బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇటీవల బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో భాగంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య వద్ద రూ. 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. జానకి రామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ నుంచి 95 లక్షల రూపాయల చెక్ అందుకున్నారు. అయితే ఈ చెక్ బౌన్స్ కావడంతో న్యాయం కోసం జట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.
ఇక ఈ కేసు విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్ కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష అలాగే 95 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై బండ్ల గణేష్ స్పందిస్తూ తాను న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తానని కూడా తెలిపారు. తాజాగా ఈ చెక్ బౌన్స్ కేసు విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి . బండ్ల గణేష్ పై కేసు నమోదు చేసిన జట్టి వెంకటేశ్వర్లు ఈ కేసు విషయంలో ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తనకు బండ్ల గణేష్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.
బండ్ల గణేష్ తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా ఫ్యామిలీకి బండ్ల గణేష్ ఫ్యామిలీకి దాదాపు 15 సంవత్సరాల నుంచి చాలా మంచి అనుబంధం ఉంది. మా అబ్బాయి, బండ్ల గణేష్ మంచి స్నేహితులు. తన కొడుకు మరణించిన తర్వాత తనకు బండ్ల గణేష్ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి అయితే ఇవన్నీ కూడా మధ్యవర్తుల వల్ల మాత్రమే వచ్చాయని జెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయంలో తను కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా తీర్పు ఇచ్చారు. అయితే మీడియా వాళ్ళు మా మాట వినకుండా ఇంటర్వ్యూలు అంటూ గోల చేశారు.
తమ మధ్య విభేదాలు ఏమీ లేవు, బండ్ల గణేష్ గారితో తనకున్న స్నేహం, ఆప్యాయత, అనుబంధం మునుపటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేసిన జెట్టి వెంకటేశ్వరరావు. @ganeshbandla #BandlaGanesh pic.twitter.com/8eCZxq0zZT
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 24, 2026
ప్రస్తుతం మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నాము బండ్ల గణేష్ తాను ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటున్నామని జెట్టి వెంకటేశ్వర్లు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా వీడియో విడుదల చేశారు. బండ్ల గణేష్ తనకు మధ్య స్నేహబంధం మునుపటిలాగే కొనసాగుతుందని ఈయన ఈ సందర్భంగా తెలియచేశారు. ఇలా జెట్టి వెంకటేశ్వర్లు చెక్ బౌన్స్ కేసు విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఈ కేసు సుఖాంతం అయిందని తెలుస్తోంది. మరి ఈయన విడుదల చేసిన ఈ వీడియో పై బండ్ల గణేష్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.. శాలినితో రిలేషన్ పై రోహిత్ ఓపెన్ కామెంట్స్!