Bhogi Movie:సంపత్ నంది ..ఏమైంది ఈ వేళ అంటూ తొలిసినిమా తోనే సాలిడ్ హిట్ కొట్టిన ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ తాజాగా శర్వానంద్ తో భోగి సినిమాని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ ని ఈనెల 27న పలకరించనుండటం తో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్ .ఈ సందర్బంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంపత్ నంది మాట్లాడుతూ ‘భోగి’ సినిమా కథకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.
అప్పట్లో ఒక వ్యక్తి మూఢ నమ్మకాలతో
చిన్నప్పుడు ‘రామగిరికిల్ల గుట్ట’ ‘చీకట్ల తోట’ అనే ప్రాంతాల గురించి విన్న విషయాల నుంచి ఈ కథకు బీజం పడిందని, అప్పట్లో ఒక వ్యక్తి మూఢ నమ్మకాలతో చాలామందిని కిడ్నాప్ చేసి చంపేశాడనే విషయం తన మనసులో అలాగే ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు..
తర్వాత తన టీంలో రైటర్ బాలాజీ కూడా అదే విషయం గురించి మాట్లాడటంతో, తనకి చిన్నప్పటి భయాలు, ఆ రోజులు గుర్తొచ్చాయని వివరించాడు. 70s లేదా 80s బ్యాక్‌డ్రాప్‌లో మన ఊరి కథ, మనకు కలిగిన భయం చెబితే బాగుంటుందని అనిపించి కథ రాసుకున్నానని చెప్పుకొచ్చాడు.ఇక కథ పూర్తయిన రెండు మూడు నెలల్లోనే శర్వానంద్‌కు చెప్పగా, కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపాడు.
అయితే ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఇది కులాల మీద లేదా ఊరి గుర్తింపు మీద తీసిన సినిమానేమో అని అనుకున్నారని , పాటలో పొలాల పేర్లు, చివర్లో దొర పెట్టడం వంటి సీన్ల వల్ల అలా అనిపించి ఉండొచ్చు కానీ, ఈ కథ అసలు అది కాదని క్లారిటీ ఇచ్చాడు సంపత్ నంది .
కథలో అవసరం ఉంది కాబట్టే
అలాగే, ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాల లాగా అనవసరంగా తలలు నరకడం, బ్లడ్ బాత్ లాంటి వైలెన్స్ ఇందులో లేదని , సెన్సార్ వాళ్ళు కూడా కథలో అవసరం ఉంది కాబట్టే సెకండ్ హాఫ్‌లో వచ్చే వైలెన్స్‌ను కట్ చేయలేకపోయామని చెప్పారని సినిమా గురించి వివరించాడు. ఇక సినిమాలో హీరో కత్తి పట్టడానికి గంటన్నర పడుతుందని, ఎవరినీ చెంప దెబ్బ కూడా కొట్టడని చెప్పడం విశేషం.
ఇక ఇది స్టార్ హీరో కోసం రాసిన కథ కాదని, ఒక కామన్ మనిషికి అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తాడో అదే చూపించామన్నాడు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్.ఇక సినిమాలో అన్నదమ్ముల , అన్నయ్య చెల్లెళ్ల బంధం చుట్టూ కూడా కథ తిరుగుతుందని తెలిపాడు.
చాలా లేయర్స్, ఊహించని ట్విస్టులు
అయితే బయట వినబడుతున్నట్టుగా ఈ కథ మూఢ నమ్మకాల చుట్టూ తిరిగే ఒక రివెంజ్ స్టోరీ మాత్రమే కాదని ఇందులో చాలా లేయర్స్, ఊహించని ట్విస్టులు ఉంటాయని సినిమాపై హైప్ పెంచేశాడు.
క్లైమాక్స్ దాకా ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో అర్థం కాదని . ఒక మాటలో చెప్పాలంటే ఇది డబ్బు కి , జ్ఞానానికి మధ్య జరిగే యుద్ధమని వీళ్ళిద్దరి యుద్ధంలో ఆ ఊరు, చుట్టుపక్కల ట్రైబల్ విలేజెస్ ఎలా బలి అయ్యాయనేదే అసలు కథ అని క్లారిటీ ఇచ్చాడు సంపత్ నంది.