Rajinikanth- Vijay Deverakonda:సాధారణంగా సెలబ్రిటీలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది అదే సెలబ్రిటీలు ఏదైనా పెళ్లి వేడుకల్లో ఒకే చోట కనిపిస్తే చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలోనే ఇటీవల కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న అనిరుద్ రవిచందర్ ,తన ప్రేయసి కావ్య మారన్ తో ఏడడుగులు వేశారు. పైగా చెన్నై వేదికగా నవంబర్ 22న చాలా గ్రాండ్గా రిసెప్షన్ కూడా జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకల్లో సినీ ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. అందులో ప్రత్యేకించి విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకే ఫ్రేమ్లో కనిపించడమే కాదు వారు తమ సతీమణులతో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. గ్రీస్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అనిరుధ్, కావ్య మారన్ వివాహం చాలా ఘనంగా నవంబర్ 10 , 11 తేదీలలో జరిగింది. ఇక చెన్నైలో ఐటీసీ గ్రాండ్ చోళా లో నవంబర్ 22న ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ..విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నతో ఈ రిసెప్షన్ వేడుకకు హాజరు కాగా… అటు రజనీకాంత్ కూడా తన భార్యతో కలిసి సందడి చేశారు . అలా ఈ రెండు జంటలు ఒకే ఫ్రేమ్లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాయి . పైగా ఈ జంటలు సరదాగా మాట్లాడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెర వెనుక సందడి చేసిన వీరు బాక్సాఫీస్ వద్ద తమ చిత్రాలతో భారీగా పోటీ పడ్డ విషయం తెలిసిందే. 2016లో జూలై 22న రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం విడుదల కాగా .. అదే ఏడాది జూలై 29న విజయ్ దేవరకొండ తొలిసారి హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమా విడుదలయ్యింది.
ఇక 2018లో నవంబర్ 29న రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా విడుదల కాగా.. అదే ఏడాది నవంబర్ 17వ తేదీన విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా విడుదలైంది
ALSO READ: బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!
ఇక ఈ ఏడాది.. జైలర్ 2 తో రజనీకాంత్ దసరా బరిలో దిగగా.. ఇదే పండుగ సీజన్లో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి చిత్రాలు కూడా విడుదలయ్యాయి.అలా ఈ సెలబ్రిటీలు ఒకే ఏడాది ..ఒకే నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీపడ్డారు. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు భార్యలతో సహా ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు.