E-Paper
Advertisement

సినిమా ప్రమోషన్ల కోసం చేతబడి చేసిన హీరోలు.. షాక్ లో నిర్మాత!

సినిమా ప్రమోషన్ల కోసం చేతబడి చేసిన హీరోలు.. షాక్ లో నిర్మాత!
Advertisement

Niharika Konidela: సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే ఆ సినిమా షూటింగ్ కంటే కూడా ప్రమోషన్లకి చిత్ర బృందం ఎంతో కష్టపడుతూ ఉంటారు. తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడం కోసం విభిన్న రీతులలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా సినిమాలను ప్రమోట్ చేయడంలో మెగా డాటర్ నిహారిక(Niharika) రూటే సపరేట్ అని చెప్పాలి. ఇటీవల ఈమె నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక త్వరలోనే పాకెట్ రాకెట్స్ (pocket rockkets)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సాంగ్ ప్రమోషన్ కోసం చేతబడి..

ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో విభిన్న రీతిలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా హీరోలు రోడ్డుపైకి ఎక్కి నిహారిక నెపోటిజం చూపిస్తున్నారని మాకు న్యాయం చేయాలి అంటూ ప్రమోషన్లను నిర్వహించగా తాజాగా అప్సర సాంగ్ ప్రమోషన్ కోసం ఈ సినిమా హీరోలు ఏకంగా చేతబడి (black magic) నిర్వహిస్తూ ఒక ప్రమోషన్ వీడియోని విడుదల చేశారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా కూడా ప్రమోషన్లు చేస్తారా..

Advertisement

ఈ సినిమా నుంచి అప్సర అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాట ప్రమోషన్లలో భాగంగా ఈ ఇద్దరు హీరోలు చేతబడి చేస్తూ ఉండగా నిహారిక అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సాంగ్ నేడు సాయంత్రం విడుదల కాబోతుంది. ఇందులో భాగంగానే వీరు విడుదల చేసిన ఈ చేతబడి ప్రమోషన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా కూడా సినిమాలను ప్రమోట్ చేస్తారా? ఎంతైనా మెగా డాటర్ ప్లానింగ్ వేరు, ఇదెక్కడి మ్యాడ్ ప్రమోషన్స్ రా నాయనా అంటూ ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

?hvrq=MW5wZXlvdG01cW40cA%3D%3D

Advertisement

ఇక డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా క్యాసినో నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జెడి చక్రవర్తి కూడా భాగమయ్యారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక నిహారిక నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు . ఇక ఈమె ఇప్పటికే కమిటీ కుర్రోళ్ళు, రాకాసా అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే పాకెట్ రాకెట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కాకుండా నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్ తో కలిసి బరి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: మెగా వర్స్ నుంచి క్రేజీ ప్రోమో రిలీజ్.. సస్పెన్స్ కు తెరదించిన నెట్ ఫ్లిక్స్!

Related News

చిన్నప్పుడు విన్న భయంకరమైన కథే ‘భోగి’కి స్ఫూర్తి.. అసలు విషయం బయటపెట్టిన సంపత్ నంది!

ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్!

శర్వానంద్ భోగి ఫస్ట్ రివ్యూ.. అసలేముంది ఇందులో?

ప్రీ స్కూల్ లోకి అడుగుపెట్టిన క్లీంకారా.. ఉపాసన – రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్స్ వైరల్!

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘దాదా’పై నో టెన్షన్..!

మోహన్ బాబు @ 51.. కలెక్షన్ కింగ్ సినీ ప్రస్థానం..

పెద్ది సినిమా స్పెషల్ సాంగ్ వివాదం….. శృతిహాసన్ స్లిప్పర్ షాట్ సమాధానం!

Big Stories

Advertisement
×