Mohan Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు స్టార్ హీరోలు.. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలుగా సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలామంది 50 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు.. తాజాగా విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 51 ఏళ్ళను పూర్తి చేసుకున్నాడు. మోహన్ బాబు 51 పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. తాజాగా మోహన్ బాబు కి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా హీరోగా తండ్రిగా పలు కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటీనటుల్లో కలెక్షన్ కింగ్ హీరో మోహన్ బాబు ఒకరు. ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తయింది.. ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు ఇన్నేళ్లు ఇండస్ట్రీలో తన నటనకు ప్రాధాన్యత ఇచ్చి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.. సినీ ఇండస్ట్రీలో 51 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా విషెస్ చెప్పి ఆయనతో కేక్ కట్ చేయించారు. నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక వేడుకను నిర్వహించారు.. వి.వి.వినాయక్, బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, వెంకీ అట్లూరితో పాటు నటులు బ్రహ్మానందం, వి.కె.నరేశ్, సునీల్, రచయిత కోన వెంకట్, పలువురు నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబందించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..
మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. 1969 ప్రాంతంలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తూనే సినిమాల్లోకి ప్రవేశించి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.. ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. 1974లో అల్లూరి సీతారామరాజుతో పరిచయమై, 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రంతో మంచి గుర్తింపు పొందారు.. విలన్ గా ఆయన చేసిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అందుకోవడంతో వరుసగా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. అలా 50 ఏళ్లు దాదాపు ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఈ ఏడాది మోహన్‌బాబు నటుడిగా తనదైన ముద్ర వేశారు. ‘ది ప్యారడైజ్’, ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.. ఆ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ ఏడాది కూడా ఆయన సక్సెస్ఫుల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. మోహన్ బాబు ఇండస్ట్రీ లోకి వచ్చి 51 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే వంద ఏళ్ళు సినీ ఇండస్ట్రీలోనే ఉండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అంటూ కోరుకుంటున్నారు. మరి ఆయన కుటుంబ సభ్యున్ని నిర్వహించిన వేడుక వీడియో ఒకసారి మీరు ఇక్కడ చూసేయండి..
https://twitter.com/tigerstalwart/status/2124852703964889191/video/1?a=rkHhs6T8yerOqnq6l_k&s=46
Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు డౌట్.. బాలు ఏడ్పించేసాడు.. పాపం మీనా..