Ram Charan – Upasana:సాధారణంగా పిల్లలు మొదటిసారి ప్రీ స్కూల్లో అడుగుపెట్టినప్పుడు తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది వారి జీవితంలో ఒక మధురమైన భావోద్వేగభరితమైన ఘట్టం. తమ చిన్నారి మొదటిసారి యూనిఫామ్ వేసుకుని, బ్యాగ్ తగిలించుకొని మరి బడికి వెళ్తుంటే తల్లిదండ్రుల కళ్ళల్లో మెరిసే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అప్పటివరకు తమ కళ్ళముందే.. తమ నీడలోనే పెరిగిన బిడ్డ తొలిసారి తమను వదిలి, కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంటే కలిగే ఆనందం , చిన్నపాటి బెంగ వర్ణనాతీతం. అయితే తమ బిడ్డ భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావిస్తూ అలాంటి మధురానుభూతులను పొందుతూ మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఉపాసన (Upasana ), రాంచరణ్ (Ram Charan) దంపతులు.
ఇన్ని రోజులు తమ సంరక్షణలో తమ చుట్టే తిరుగుతూ సందడి చేసిన తమ గారాల పట్టి క్లీంకారాను ప్రీస్కూల్లో చేర్పించారు. చిన్నారి జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన ఈ సరికొత్త ఘట్టం కుటుంబ సభ్యులతో పాటు అటు అభిమానులలో కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడున్నర సంవత్సరాల వయసున్న క్లీంకారా తాజాగా ప్రీస్కూల్లోకి అడుగుపెట్టిన ఆనందపు క్షణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు.. దాదాపు దశాబ్దకాలం తర్వాత.. 2023 జూన్ 20న పండంటి పాప జన్మించింది. మెగా కుటుంబంలోకి ఈ పాప రాకతో అప్పట్లో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషాన్ని పంచుకున్నాయి. క్లీంకారా అని నామకరణ మహోత్సవం జరిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే క్లీంకారా రాకతో అటు మెగా హీరోలకి కూడా అదృష్టం కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే క్లీంకారాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తుండగా.. ఇప్పుడు తమ ముద్దుల కూతురిని స్కూల్ కి పంపిస్తూ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఈ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా క్లీంకారా తొలి అడుగు ప్రీస్కూల్లోకి పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో కూతురు, తన బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అప్పుడే అడుగులు వేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి తాజాగా వైరల్ అయిన వీడియోలో.. రామ్ చరణ్ – ఉపాసన దంపతులతో పాటు వారి పెంపుడు కుక్క రైమ్ కూడా వీరి వెంటే వచ్చింది. అలాగే ఇందులో క్లీంకారా తన క్యూట్ లుక్స్ తో మరోసారి ఆడియన్స్ ను దోచుకుంది.
also read:రౌడీలను హౌస్ లోకి పంపించారు.. బిగ్ బాస్ పై నటరాజ్ మాస్టర్ ఫైర్!
పెద్ది సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్ . ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఆర్ సి 17 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు.ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది లుక్ నుండి బయటపడడానికి ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. శిక్షణ నుండి చిన్న విరామం తీసుకుంటూ నవంబర్ 20న హైదరాబాద్ కి తిరిగివచ్చారు. ఇక అందులో భాగంగానే తన కూతుర్ని భార్యతో సహా దగ్గరుండి మరీ ప్రీస్కూల్లో చేర్పించారు రామ్ చరణ్.