E-Paper
Advertisement

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!
Advertisement

Congress Ministers: రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం దక్కుతున్నాయా? అనే అంశాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రాష్ట్ర మంత్రులతో వరుసగా ‘వన్ టు వన్’ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలను ఆరా తీస్తున్నారు. గాంధీభవన్ వేదికగా జరిగిన ఈ ప్రత్యేక భేటీల్లో ఒక్కో మంత్రిని పిలిచి, వారి సొంత నియోజకవర్గంతో పాటు ఇన్‌ఛార్జిగా ఉన్న జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులపై ఏఐసీసీ ఇన్‌ఛార్జి లోతుగా సమీక్షించారు.”మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయి?” అంటూ మంత్రులను సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కొత్త ఇన్ చార్జ్ ఆదేశాలిచ్చారు.

కార్యకర్తలను కాపాడుకోవాల్సిందే..

ఇక మంత్రులు,ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఎక్కడైనా ఉందా? పాత,కొత్త నాయకుల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయా? అనే కోణంలోనూ కొత్త ఇన్ చార్జ్ తన టీమ్ లతో నివేదికలు తెప్పించుకుని చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్తల మనోభావాలపై ఈ భేటీల్లో ప్రధానంగా చర్చ జరిగింది.”పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాడర్‌ను విస్మరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే.” అంటూ కొత్త ఇన్ చార్జ్ సూచించారు.

Advertisement

Also read: కర్ణాటక ఫేమస్ బిసిబెళె బాత్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

పదవులు, ప్రాధాన్యత విషయంలో తగ్గొద్దు..

నామినేటెడ్ పోస్టుల భర్తీ, మార్కెట్ కమిటీలు, ఇతర ప్రభుత్వ పదవుల పంపకాల విషయంలోనూ ఏఐసీసీ ఇన్‌ఛార్జి కీలక సూచనలు చేశారు.పైరవీలకు తావులేకుండా, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన నిజమైన కార్యకర్తలకే పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక వంటి కీలక ప్రక్రియల్లో పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించాలని, అధికారిక కార్యక్రమాల్లోనూ వారికి తగిన గౌరవం దక్కేలా మంత్రులు చొరవ చూపాలని సూచించారు.పదవులు, ప్రాధాన్యత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని, జిల్లా స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వారిలో కొత్త ఉత్సాహం నింపాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రుల పనితీరుపై అధిష్ఠానం నిఘా..

Advertisement

ఈ ‘వన్ టు వన్’ భేటీల ద్వారా మంత్రుల పనితీరును కూడా అధిష్ఠానం బేరీజు వేస్తోంది. కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా, వారానికి కనీసం రెండు మూడు రోజులు జిల్లాల పర్యటనలు చేయాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్వహించిన ఈ నేరుగా ముఖాముఖి సమావేశాలతో మంత్రుల్లోనూ, జిల్లా నాయకత్వంలోనూ ఒక్కసారిగా కదలిక మొదలైంది. రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు మరింత భరోసా లభించే అవకాశం ఉందని గాంధీభవన్ లో చర్చ జరుగుతుంది.

Also Read: బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!

Tags

Related News

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సోదరుడిపైనా కేసు నమోదు!

తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌‌తో రాజగోపాల్‌-అనిరుధ్ భేటీ.. చర్యలు తప్పవు, పదవులు దూరం చేసుకోవద్దని సూచన

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

కారును లారీ ఢీ కొట్టి.. హైదరాబాద్ దంపతులు మృతి, ఖమ్మం జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘటన

పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!

Big Stories

Advertisement
×