E-Paper
Advertisement

శర్వానంద్ భోగి ఫస్ట్ రివ్యూ.. అసలేముంది ఇందులో?

శర్వానంద్ భోగి ఫస్ట్ రివ్యూ.. అసలేముంది ఇందులో?
Advertisement

Sharwanand Bhogi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చార్మింగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శర్వానంద్ (Sharwanand) ఒక వినూత్నమైన రస్టిక్ రూరల్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ భోగి మూవీ సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. పైగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి A(అడల్ట్స్ మాత్రమే) సర్టిఫికెట్ ఇవ్వడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఈ చిత్రానికి ఎందుకు ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చారు? ఈ సినిమా రన్ టైం ఎంత ? అసలు కథలో ఏముంది? తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

సెన్సార్ పూర్తి చేసుకున్న భోగి.. రన్ టైమ్ లాక్..

విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. 2 గంటల 34 నిమిషాలుగా రన్ టైం ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన డింపుల్ హయతి (Dimple hayathi), అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు శరతస్వాత్, అవినాష్ ,లాల్ దయానంద రెడ్డి, ఆడుకాలం నరేన్ , రోహిత్ పట్నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా.. కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా కిరణ్ కుమార్ మన్నే పనిచేశారు.

భోగి ఫస్ట్ రివ్యూ..

Advertisement

ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బొగ్గుల గుట్ట అనే గ్రామంలో కమ్మరి గంగ (శర్వానంద్) కష్టపడి పని చేసే ఒక కూలీగా కనిపిస్తాడు. ఆయన తన ఐదుగురు చెల్లెల్లు, కుటుంబమే తన లోకంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఆ ఊరిని కొంతమంది భాగస్వామ్యలు తమ గుప్పెట్లో పెట్టుకొని ఆకృత్యాలు చేస్తూ ఉంటారు. ఇదే ఊరిలో మోదుగ ఆకులతో విస్తరాకులు కొట్టుకుంటూ జీవించే అమ్మాయి కందుల సులోచన రాణి పాత్రలో అనుపమ పరమేశ్వరన్, మరోవైపు అదే ఊరిలో అందచందాలతో గ్లామర్ తో ఆకట్టుకునే మందారం పాత్రలో డింపుల్ హయతి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ఇక ప్రతి అమావాస్యకు చేసే పూజ సమయంలో కొన్ని మిస్టరీ ఘటనలు గంగను వెంటాడుతూ ఉంటాయి. మూఢనమ్మకాలు, ఆచారాల వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? భూస్వాముల చర నుంచి తన గ్రామాన్ని గంగా ఎలా విడిపించాడు? ఆ సమయంలో భూస్వాముల నుంచి గంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగతా కథ.

ALSO READ: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సూర్య సీన్.. ఎక్కడ చూడొచ్చంటే?

అందుకే A సర్టిఫికెట్..

Advertisement

ఇటీవల ఐదుగురు సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు బృందం ఈ సినిమాను వీక్షించి ఇందులో కొన్ని సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటివరకు చార్మింగ్ స్టార్ గా పేరు దక్కించుకున్న శర్వానంద్ పూర్తిగా భిన్నమైన రా అండ్ రస్టిక్ లుక్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే కనిపిస్తారట. ఇందులో ఒక బలమైన గ్రామీణ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకుబోతున్నట్లు తెలుస్తోంది. భూస్వాముల పాత్రలు అత్యంత క్రూరంగా ఉంటాయని.. డైరెక్టర్ తెరను హింస, రక్తపాతంతో నింపేశారు అనే వార్త కూడా వినిపిస్తోంది . అందుకే ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారట. మరి మొదటి రివ్యూ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి నవంబర్ 27న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

ప్రీ స్కూల్ లోకి అడుగుపెట్టిన క్లీంకారా.. ఉపాసన – రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్స్ వైరల్!

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘దాదా’పై నో టెన్షన్..!

మోహన్ బాబు @ 51.. కలెక్షన్ కింగ్ సినీ ప్రస్థానం..

పెద్ది సినిమా స్పెషల్ సాంగ్ వివాదం….. శృతిహాసన్ స్లిప్పర్ షాట్ సమాధానం!

రెండు సినిమాలు బ్లాక్ బస్టర్.. ఇష్ట దైవాన్ని దర్శించుకున్న సాయి పల్లవి!

మళ్లీ వెండితెరపైకి ఎన్టీఆర్.. ఈసారి ఏఐ టెక్నాలజీతో!

బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!

Big Stories

Advertisement
×