E-Paper
Advertisement

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!
Advertisement

Trolls On Hardik Pandya:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ వేలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ శరావేగంగా జరుగుతోంది. ఈ తరుణంలోనే హార్దిక్ పాండ్యా కోసం ముంబై మినహా 9 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. కానీ చివరకు అతన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ట్రేడ్ ఒప్పందంలో భాగంగా పాండ్యా స్థానంలో అర్షదీప్ సింగ్‌ను ముంబై దక్కించుకుంది. ఈ డీల్‌తో ముంబై ఇండియన్స్‌కు మాత్రమే మేలు జరిగిందని, పంజాబ్ కింగ్స్‌కు తీవ్ర నష్టమేనని చర్చ నడుస్తోంది. పాండ్యా ఎంట్రీతో పంజాబ్ జట్టులో చీలిక రావడం గ్యారెంటీ అనే చర్చ నడుస్తోంది. హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రమని..పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ అంటూ నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు.

పాండ్యాను భరించడం ప్రీతి జింటా వల్ల కాదు..ఇక పంజాబ్ సర్వనాశనమే!

పంజాబ్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్టే. బీసీసీఐ నుంచి పర్మిషన్ రాగానే అధికారిక ప్రకటన ఉంటుంది. అయితే, ఈ ప్రకటన రాకముందే, పంజాబ్ జట్టులో చీలిక రావడం గ్యారెంటీ అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాండ్యా రాకతో ముందుగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పోతుందని చెబుతున్నారు. సీనియారిటీ, కెప్టెన్సీ అనుభవం, గుజరాత్ టైటాన్స్‌ను ఓ సారి చాంపియన్‌గా నిలబెట్టడం లాంటి అంశాలను బేరీజు వేసుకుని పాండ్యాను ప్రీతి జింటా తీసుకుంది. ఈ లెక్కన 2027లోనే అయ్యర్‌ను పక్కకు పెట్టి, పాండ్యాను కెప్టెన్ చేయడం గ్యారెంటీ అని చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే, పంజాబ్‌లో ఉన్న ప్లేయర్లు ఎవరూ అమె నిర్ణయాన్ని అంగీకరించకపోవచ్చని అంటున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

పాండ్యా కెప్టెన్సీపై ఆటగాళ్లు తిరుగుబాటు చేస్తారని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ లాంటి సీనియర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రీతి జింటా పాండ్యాకు కెప్టెన్సీ అవకాశం ఇస్తే, మరో ముంబైలా పంజాబ్ మారిపోతుందని అంటున్నారు. గతంలో ఇలాగే రోహిత్ శర్మను పక్కకు పెట్టి, పాండ్యాను అంబానీ కెప్టెన్ చేశాడు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి మరీ నెత్తిన పెట్టుకున్నాడు. కానీ ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. మళ్లీ పాండ్యాను బయటకు పంపి, రోహిత్ శర్మకే పగ్గాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే సీన్ రేపు పంజాబ్ కింగ్స్‌లోనూ రిపీట్ అవుతుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు పాండ్యాకు పగ్గాలు అప్పగిస్తే, అయ్యర్ కూడా మరో జట్టును చూసుకోవడం గ్యారెంటీ అని స్పష్టం చేస్తున్నారు. మరీ, ఏరి కోరి తెచ్చరుకున్న ‘పాండ్యా’ను ప్రీతి జింటా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

సెహ్వాగ్ లాగానే కొడుకు ఆర్యవీర్ కూడా కుంభకర్ణుడే…కదలరు, మెదలరు

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు స్కూటర్లు.. షాహిద్ అఫ్రిది బంపర్ ఆఫర్!

అంబానీకి అస‌లు బుర్ర‌లేదు…తోపుల‌ను వ‌దిలేసి, ద‌ద్ద‌మ్మ‌ల‌ను తెచ్చుకుంటున్నాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాలో చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

ఐసీసీ ఈవెంట్ల‌లోనే టీమిండియా గెలుస్తోంది..జై షా కుట్ర‌లే మా కొంప‌లు ముంచుతున్నాయి

పాకిస్తాన్ ప్లేయ‌ర్ షూ లేస్ క‌ట్టిన టీమిండియా ప్లేయ‌ర్..షాకింగ్ వీడియో వైర‌ల్

ఛీ.. మీది ఓ గెలుపేనా? 35 ఏళ్ల అలీ రజాను తీసుకొచ్చి టీమిండియా కుర్రాళ్ల‌ను ఓడించారు

Big Stories

Advertisement
×