Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. తాజాగా ఈయన నాగార్జున (Nagarjuna) సమర్పణలో సాయి అనీష్, అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరో హీరోయిన్లుగా నటించిన ఇట్లు అర్జున(Itlu Arjuna) సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ అనస్వర గురించి మాట్లాడుతూ కాకా సినిమా(Kaaka Movie)కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. అనస్వర రాజన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కాకా సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదివరకే ఈమెకు సంబంధించి నిర్మాతలు అధికారకంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అయితే అనస్వర ఈ సినిమాలో ఏ పాత్రలో నటించబోతుందనే విషయం మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే చిరంజీవి కూతురు పాత్రలో ఈమె నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు సరైన స్పష్టత మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ తాజాగా కాకా సినిమాలో అనస్వర పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ అనస్వర చాలా అద్భుతంగా నటించిందని ఈ నెలలో ఈమె ఇట్లు అర్జున సినిమాతో సక్సెస్ అందుకోగా సంక్రాంతికి కాకా సినిమాతో మరో హిట్ కొట్టబోతుందని తెలిపారు.
నాన్నగారు నటిస్తున్న కాకా సినిమాలు అనస్వర పాత్ర గురించి చెబుతూ… నేను ‘చిరు లీక్స్’ (Chiru Leaks)లాగా కాదు.. చిరంజీవి గారితో తన రిలేషన్ ఏంటి అనే విషయాన్ని లీక్ చేయను అంటూ అసలు విషయం దాటవేశారు. అయితే కాకా సినిమాలో అనస్వర పాత్ర మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని కచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి అనస్వర చిరంజీవికి నిజంగానే కూతురుగా నటించబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ తాజాగా తమన్ , చరణ్ చేసిన కామెంట్స్ బట్టి చూస్తుంటే సంక్రాంతి బరిలో కాకా ఉండబోతుందని, విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సంక్రాంతి సందర్భంగా కాకా సినిమాతో చిరంజీవి ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ఇటీవల సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
Also Read: సినిమా రిలీజ్ డేట్ మర్చిపోయిన అనస్వర… మర్చిపోవడంలో తప్పులేదులే?