Fans Trolling Virendar Sehwag Son Aaryavir: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో గెలవాల్సిన టీమిండియా చివరి క్షణంలో చేతులు ఎత్తేసింది. అయితే టీమ్ ఇండియా ఓడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. పసికూనలపై రెచ్చిపోయిన టీమిండియా అండర్ 19 జట్టు ప్లేయర్లను ఉద్దేశించి, పాక్ పై ఎందుకు ఆడలేదని అసభ్యకరమైన పోస్టులు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కొడుకులపై చెత్త పోస్టులు పెట్టి చీల్చి చెండాడుతున్నారు.
పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో రక రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ లాగానే ఆర్యవీర్ కూడా సోమరిపోతని…వీడు కూడా ముద్దపప్పులా తయారయ్యాడని విమర్శలు చేస్తున్నారు. బ్యాటింగ్ లో ఆడుతున్నప్పటికీ.. తండ్రి లాగా ఫీల్డింగ్ లో కూడా అధ్వానంగా తయారయ్యాడని ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి బౌండరీ గేటు దగ్గర మాత్రమే నిలబడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బౌండరీ గేటు దగ్గర నిలబడి వార్మప్ చేస్తున్నాడు తప్ప బంతి మాత్రం పట్టడం లేదని ఆగ్రహిస్తున్నారు. అంతేకాదు బౌండరీ గేట్ దగ్గర ఆర్యవీర్ చేసే చేష్టల వీడియోలను కూడా వైరల్ చేసి ఆడుకుంటున్నారు. 19 సంవత్సరాల వయసులోనే ఇంత లేజీగా ఉంటే…భవిష్యత్తులో వీడేం ఆడతాడు అంటూ ఆగ్రహిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా గతంలో ఇలాగే ముద్దపప్పు లాగా ఒకే దగ్గర ఫీల్డింగ్ చేసేవాడని గుర్తు చేస్తున్నారు. హర్భజన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించాడు. ఆయన మాటలను గుర్తు చేస్తూ వీరూ ఫ్యామిలీపై మరింత రెచ్చిపోతున్నారు.
ఇది ఇలా ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగానే రాణించాడు. ఈ తరుణంలోనే ఇటీవల ప్రారంభమైన ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ తరుణంలోనే నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొట్టాడు. 52 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. కానీ పాకిస్తాన్ అండర్ 19 జట్టులో జరిగిన మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశాడు. 40 బంతుల్లో 22 పరుగులు సాధించి, దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ కొడుకు అన్వయ్ ద్రవిడ్ కూడా 10 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా ఓటమి పాలైంది.