BigTV English

Mirai Movie : ‘మిరాయ్’ కు బిగ్ షాక్.. HD క్వాలిటితో ప్రింట్ లీక్..

Mirai Movie : ‘మిరాయ్’ కు బిగ్ షాక్.. HD క్వాలిటితో ప్రింట్ లీక్..

Mirai Movie : స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా అభిమానులు ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్తారు. తమ హీరో సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాకు కలెక్షన్లు పెరిగేలా చూసుకుంటారు. ఒకవైపు అభిమానులు అటు హీరోలు తమ సినిమాను సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ ని అందుకుంటే కచ్చితంగా ఆ సినిమా వెంటనే పైరసీ కూడా అవుతుంది. ఈమధ్య రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే పైరసీకి గురవుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వగా.. ఇక రీసెంట్ గా హనుమాన్ ఫేమ్ హీరో తేజా సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ మిరాయ్ కు కూడా లీకుల బెడద తప్పలేదు.. సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే HD క్వాలిటీతో ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది.. మరి దీనిపై ఆ మూవీ టీమ్స్ స్పందించిందా లేదా అన్నది ఆసక్తిగా మారింది..


‘మిరాయ్’ HD ప్రింట్ లీక్..

హనుమాన్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీ తర్వాత తేజా నటించిన మిరాయ్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకు హైలెట్ అదే అని టాక్ జనాల్లో వినిపిస్తుంది.. అయితే సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇది సంతోషించాల్సిన విషయమే కానీ ఈ సినిమా పైరసీ అవ్వడం టీంకు బిగ్ షాక్ అనే చెప్పాలి. రిలీజ్ అయిన రెండో రోజే HD క్వాలిటితో ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయింది. కొన్ని వెబ్సైట్లు ఈ సినిమాని పైరసీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచి సినిమాకు ఇలాంటి ఎదురు దెబ్బ తగలడంతో కొందరు అభిమానులు సైబర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయాలంటూ టీం కి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి దీనిపై ఈ చిత్ర యూనిట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి..

Also Read: శ్రేష్ఠ వర్మ ఒక్క వారానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?


‘మిరాయ్’ కలెక్షన్స్.. 

హనుమన్ తర్వాత తేజ నుంచి వచ్చిన సూపర్ హీరో మూవీ మిరాయ్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. టాప్ టెక్నీషియన్లు, మ్యూజిక్, నటీనటుల రెమ్యూనిరేషన్ మొత్తం కలిపి 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే 65 కోట్లు వసూలు. మొదటిరోజు అన్ని ఏరియాల్లో కలిపి 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక రెండో రోజు కూడా భారీగానే ఓపెనింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. మొత్తానికి ఈ సినిమా రెండు రోజులకే 30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై టీం అధికారికి ప్రకటన వెల్లడించాల్సి ఉంది.

Related News

The Paradise: ‘ ప్యారడైజ్ ‘ లో మోహన్ బాబు.. స్టోరీ లీక్ చేసిన మంచు లక్ష్మీ..

Raghava lawrance : అభిమాని టాలెంట్ కు లారెన్స్ ఫిదా.. నోట్ల వర్షం.. వీడియో వైరల్..

Kantara Chapter 1 : మానవాతీత శక్తులు నాగ సాధు, మెంటల్ మాస్ స్టోరీ లైన్

Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన

Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్

Mirai: మిరాయ్ మూవీ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Pawan Kalyan OG : రంగంలోకి దిగిన పవన్… ఇక పరిస్థితులు మారుతాయి

Big Stories

×