Bigg Boss 9 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవలే ప్రారంభమైంది. 15 మంది సెలబ్రిటీలు సామాన్యులతో ఈ షో నీ గ్రాండ్ గా ప్రారంభించారు. సామాన్యులకు ఎక్కువ పవర్స్ ఇచ్చారు. వాళ్లకు అసిస్టెంట్స్ గా సెలబ్రిటీల టీమ్ ఉండాలని చెప్పారు. అదే విధంగా బిగ్ బాస్ ఆటలో తొలివారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం తొలివారం నామినేషన్స్ ప్రక్రియకంటే ముందే మొదలైపోయింది. నామినేషన్స్ ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. అయితే మొదటి వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది.. ఈ సస్పెన్స్ కు తెర పడింది.. శ్రేష్ఠ వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలిసిందే.. అయితే ఈమె ఒక్కవారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్నది సస్పెన్స్ గా మారింది..
బిగ్ బాస్ లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. హౌస్ లోని 15 మంది నుంచి ఒకరు బయటకు వచ్చేసారు. ఈ వారం హౌస్ నుంచి డాన్స్ మాస్టర్ శ్రేష్ఠ వర్మ బయటకు వచ్చేసింది. గత సీజన్పోలిస్తే ఈ సీజన్ టాస్కులు ఆటలు అంటూ ఏమీ హడావిడి కనిపించడం లేదు. దాంతో ఎలిమినేషన్ పై అంతా బజ్ రాలేదు. సామాన్యులకు సెలబ్రిటీలను ఎలిమినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తాడు.. కానీ ఇప్పుడు శ్రేష్ఠ వర్మను ఎలిమినేట్ చేస్తారు.. నిన్న శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది. ఎప్పటిలాగే నాగార్జున హౌస్ మేట్స్ ను తిట్టడం, టాస్క్ లు ఇవ్వడం అందరిని ఆకట్టుకున్నాయి. సంజన వెళ్లి పోతుందని అందరు అనుకున్నారు. కానీ బోల్డ్ బ్యూటి శ్రేష్ఠ వర్మ బయటకు వెళ్లిపోవడం ఊహించని ట్విస్ట్..
Also Read : ఆదివారం టీవీల్లోకి హిట్ చిత్రాలు.. వాటిని మాత్రం మిస్ చెయ్యకండి…
బిగ్ బాస్ లో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఫ్లోరానే. ఈమె ఇప్పటి వరకు బిగ్ బాస్ కి ఇచ్చిన కంటెంట్ ఏమి లేదు. పైగా ఈమె టాస్కులు భవిష్యత్తులో బలంగా ఆడుతుంది అనే నమ్మకం కూడా లేదు.. కానీ ఈమెను హౌస్ లో ఉంచి శ్రేష్ఠ ను బయటకు పంపారు. ఫ్లోరా షైనీ కి సంజన తో గొడవ కారణంగా కాస్త కంటెంట్ అయినా వచ్చింది, కానీ శ్రేష్టి వర్మ కి ఎలాంటి కంటెంట్ కూడా రాలేదు.. హౌస్ క్లినింగ్ పనులను బాగానే చేసింది. కానీ ఎంటర్టైన్ చెయ్యలేదు. దాంతో ఈమెను హౌస్ నుంచి బయటకు పంపేశారు. అయితే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు కాబట్టి, రెమ్యూనరేషన్ చాలా బలంగానే ఇచ్చారట. ఒక్క వారం ఉన్నందుకు గాను ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ 1.50 వేలు తీసుకుందని తెలుస్తుంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ బజ్ కు కంటెస్టెంట్ వెళ్తారు.అక్కడ శ్రేష్ఠ ఏం చెబుతుందో చూడాలి..