Kubera Movie Songs: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కుబేర(Kubera). రష్మిక(Rashmika) ధనుష్ (Danush)హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా జూన్ 20వ తేదీ విడుదల అయ్యి అన్ని ప్రాంతాలలోనూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మికకు సంబంధించిన పిప్పి పిప్పి డుం డుం (Pippi Pippi Dum dum)అనే సాంగ్ విడుదల చేయడంతో ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ పాటను సినిమాలో నుంచి తీసేయడంతో రష్మిక అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.
కన్నప్ప ఫ్లాప్ అయితే…
ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాటను ఎందుకు సినిమా నుంచి తొలగించేశారు అంటూ విమర్శలు కూడా చేశారు. ఇలా ఈ పాటను తొలగించారని బాధపడిన అభిమానులకు చిత్ర బృందం శుభవార్తను చెప్పబోతున్నారని చెప్పాలి. అతి త్వరలోనే ఈ సినిమాలో తిరిగి ఈ పాటను జోడించబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 27వ తేదీ మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప(Kannappa) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో పిప్పి పిప్పి డుం డుం అనే పాటను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
పిప్పి..పిప్పి.. డుం.. డుం
మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా ఒక మైథాలజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఏకకాలంలోనే ఐదు భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా అదే విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక జూన్ 27వ తేదీ విడుదలైన ఈ సినిమాకు ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే కనుక కుబేర సినిమాలో పిప్పి పిప్పి డుం డుం పాటను తిరిగి జోడిస్తారు. ఇలా ఈ పాటను యాడ్ చేసే మరింత కలెక్షన్లను రాబట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.
సినిమా నిడివి ఎక్కువ..
ఇకపోతే ఈ పాటను జోడించిన ప్రేక్షకులు మళ్లీ ఈ పాట కోసమే థియేటర్ కి వచ్చి చూస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నిడివి ఇప్పటికే 3.13 నిమిషాలు ఉంది. ఇక ఈ పాటను జోడిస్తే అదనంగా మరో ఐదు నిమిషాల పాటు నిడివి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి అంత సేపు ప్రేక్షకులు థియేటర్లలో కూర్చోగలరా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా ఈ పాటను జోడించిన తిరిగి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి అంతసేపు చూసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమాలో ఈ పాటను తొలగించినా కొంతవరకు అభిమానులు నిరాశ చెందిన సినిమాకు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల పరంగా, టాక్ పరంగా కుబేర ఎంతో మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి. తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Also Read: నటి తల పగలగొట్టిన హీరో శ్రీకాంత్.. కావాలనే చేశాడా?