Yashasvi Jaiswal : టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం ఒక ఫోర్ కొట్టాడు. 11 బంతులు 4 కొట్టి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో రాణించిన జైస్వాల్.. ఫీల్డింగ్ లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచాడు. జైస్వాల్ ఒక్కడే ఏకంగా 4 క్యాచ్ లు మిస్ చేయడం గమనార్హం. వాస్తవానికి ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత ఓటమికి ఫీల్డింగ్ కారణమని స్పష్టంగా అర్థం అవుతోంది. మన ప్లేయర్లు మొత్తం 6 క్యాచ్ లు వదిలేయగా.. అందులో జైస్వాల్ ఒక్కడే 4 క్యాచ్ లు వదిలివేశాడు. ముఖ్యంగా చేతిలోకి వచ్చిన క్యాచ్ లను కూడా అతడు నేలపాలు చేశాడు. అయితే మ్యాచ్ సందర్బంగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసిన సమయంలో అతను డ్యాన్స్ చేసిన వీడియో పై భారత అభిమానులు మండిపడుతున్నారు. క్యాచ్ లు వదిలేసి ఇంత హ్యాపీగా ఎలా డ్యాన్స్ చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
జైస్వాల్ పై బీసీసీఐ సీరియస్..
నిన్న జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 4 క్యాచ్ లు మిస్ చేశాడు. జైస్వాల్ క్యాచ్ లు మిస్ చేయకుండా.. టీమిండియా బౌలర్లు రాణించినట్టయితే ఇంగ్లాండ్ పై విజయం సునయాసం అయ్యేది. కానీ జైస్వాల్ తన చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా విజయానికి అడ్డుకుంటున్నాడనే చెప్పవచ్చు. ఇంగ్లాండ్ తో జరిగిన లీడ్స్ టెస్ట్ లో నాలుగు క్యాచ్ లు మిస్ చేసి విమర్శల పాలవుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కీలక ఆటగాడు డకెట్ క్యాచ్ అందుకోలేకపోయాడు జైస్వాల్. డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్ ఇవ్వగా దానిని మిస్ చేశాడు యశస్వి. మరోవైపు తొలి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు యశస్వి జైస్వాల్. దీంతో యశస్వి జైస్వాల్ పై బీసీసీఐ సీరియస్ అయినట్టు సమాచారం. ప్రధానంగా భారత్ వికెట్లు పడక ఇబ్బంది పడుతుంటే దొరక్క దొరక్క వచ్చిన అవకాశాలను జైస్వాల్ పదే పదే క్యాచ్ లను వదిలేయడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
జైస్వాల్ కి శిక్ష..
తాజాగా సోషల్ మీడియాలో ఓవార్త వైరల్ అవుతోంది. జైస్వాల్ క్యాచ్ మిస్ చేసినందుకు బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ భారత ఓపెనర్ జైస్వాల్ రెండు చేతులను పట్టుకొని చెరుకు రసం మిషన్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇవి నిజమైనవి కాదు.. కానీ వీరి ఫొటోలతో అలా ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఇలా క్యాచ్ లు విడిచిపెట్టినందుకు ఇలా చేస్తే.. మళ్లీ క్యాచ్ లు వదిలిపెట్టడు అని కొందరూ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం జైస్వాల్ ని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Siraj and Bumrah with Yashasvi Jaiswal 😡#INDvsENG pic.twitter.com/nokgWs3MeO
— Bruce Wayne (@_Bruce__007) June 24, 2025