Actor Sreekanth: నటుడు శ్రీకాంత్ (Sri Kanth)అలియాస్ శ్రీరామ్(Sri Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయారు. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ రోజా పూలు అనే సినిమా ద్వారా హీరోగా అవకాశం అందుకున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు తమిళ భాషల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తెలుగులో మాత్రం ఒకరికి ఒకరు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన శ్రీరామ్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపారు.
డ్రగ్స్ కేసులో…
ఇటీవల ఈయన హరికథ(Harikatha) అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఇది నా ఉండగా శ్రీరామ్ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో(Drugs Case) చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈయన గత కొద్దిరోజులుగా డ్రగ్స్ వాడుతున్నారనే విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తనని అరెస్టు చేసి పరీక్షలు నిర్వహించారు. ఈయన కూడా తాను చేసింది తప్పేనని తన తప్పును ఒప్పుకున్నారు. ఇకపోతే ఈ డ్రగ్స్ కేసులో భాగంగా 14 రోజుల పాటు ఈయనకు రిమాండ్ విధించారు. ఇలా డ్రగ్స్ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన శ్రీ రామ్ కి సంబంధించి పాత విషయాలు కూడా ప్రస్తుతం వెలుతులోకి వస్తున్నాయి.
తల పగిలింది…
ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ సమయంలో ఈయన మరొక నటి ఈశ్వరి రావు(Eswari Rao) తల పగలగొట్టినటువంటి సంఘటనకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. సాధారణంగా సినిమా షూటింగ్స్ జరిగే సమయంలో నటీనటులు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామ్ నటి ఈశ్వరి రావుతో కలిసి పలు సినిమాలలో నటించారు. ఇటీవల పిండం అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
అదృష్టవశాత్తు ఏం జరగలేదు..
ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఒక సన్నివేశం షూట్ చేసేటప్పుడు ఈశ్వరి గారి పీక పట్టుకున్న వ్యక్తి తలను వెనుక నుంచి ఫ్లవర్ వాజ్ తో
కొట్టాలి. అయితే ఆరోజు ఈశ్వరి గారిని తాను కళ్ళు మూసుకోమని ఎందుకు చెప్పానో అర్థం కాలేదు. ఆ ఫ్లవర్ వాస్ తీసుకెళ్లి కొట్టడంతో అతని తలపై నుంచి ఎగిరి ఈశ్వరి గారి తలకి తగిలింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా, ఆమె తల మాత్రం ఫుల్లుగా వాచిపోయిందని, హాస్పిటల్ కి వెళ్దాం అన్నప్పటికీ ఆమె మాత్రం ఒక షాట్ పూర్తి చేసి వెళ్దాము, రేపటికి మరింత వాచిపోతే సినిమా షూటింగ్ చేయడం కష్టమవుతుందని షాట్ పూర్తి చేసి హాస్పిటల్ కి వెళ్ళాము. అదృష్టవశాత్తు తనకు ఏమి కాలేదు అంటూ శ్రీరామ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: అ ఒక్కటి నాతో ఉంటే రాజకీయాల్లోకి వచ్చేస్తా… హీరో ఓపెన్ స్టేట్మెంట్