BigTV English

Shubhanshu shukla: కామ్నా, నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు.. అంతరిక్షానికి వెళ్తూ.. భార్యకు శుభాన్షు సందేశం

Shubhanshu shukla: కామ్నా, నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు.. అంతరిక్షానికి వెళ్తూ.. భార్యకు శుభాన్షు సందేశం

భర్త – ఆఫీస్ కి వెళ్లొస్తా..
భార్య – హా, సరే వెళ్లిరండి..
ఇలాంటి సంభాషణలు మనం ప్రతిరోజూ వింటూనే ఉంటాం..
మరి అంతరిక్షానికి వెళ్లొస్తా అని భర్త చెబితే భార్య రియాక్షన్ ఎలా ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లడం అంటే ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేయడమే. అలాంటి సాహసం చేయడానికి చాలామంది ఔత్సాహికులు సిద్ధంగానే ఉంటారు. మరి వారి భార్యలు కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారా..? అలాంటి రిస్క్ చేయడం ఎందుకంటూ వారిస్తారా..? రిస్క్ తీసుకునే భర్తలకు నూటికి నూరుశాతం ఇంటినుంచి మద్దతు ఉంటుందని అనుకోలేం. లైఫ్ రిస్క్ చేసే గొప్ప ప్రయోగాలకు పేరొస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరగకపోతే, జరగరానిది జరిగితే.. ఆ కుటుంబానికొచ్చే కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. కోల్పోయిన వారి స్థానాన్ని ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. అందులోనూ శుభాన్షు శుక్లా వెళ్లాల్సిన యాక్సియం-4 మిషన్ వాయిదాల మీద వాయిదా పడింది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు వారికి చాలా కీలకం. శుభాన్షు శుక్లా విషయంలో కుటుంబం ఆయనకు అండగా నిలబడింది. ఆరేళ్ల బిడ్డను తన వద్ద ఉంచుకుని, అంతరిక్షంలోకి వెళ్తున్న భర్తకు భావోద్వేగమైన వీడ్కోలు పలికింది భార్య కామ్నా. ఆమెను ఉద్దేశిస్తూ శుభాన్షు సోషల్ మీడియాలో ఉంచిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


నీవు లేనిదే..
తన అంతరిక్ష యాత్రకు భార్య కామ్న మద్దతు లేకపోతే పరిపూర్ణం అయ్యేది కాదని తెలిపారు శుభాన్షు శుక్లా. అంతరిక్షంలోకి వెళ్లేముందు భార్యనుంచి వీడ్కోలు తీసుకున్నారు. అద్దాల రూమ్ లోపల తను, బయట తన భార్య కామ్నా.. ఉన్న ఫొటోని ఇన్ స్టా లో షేర్ చేశారు శుభాన్షు. యాత్ర ప్రారంభానికి ముందు ఆయన భావోద్వేగంతో కూడిన ఓ మెసేజ్ ని సోషల్ మీడియాలో ఉంచారు. “మేము జూన్ 25 తెల్లవారుజామున ఈ గ్రహం నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారికి మద్దతు, ఆశీర్వాదం, ప్రేమను ఇస్తున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని ఆయన ఇన్‌ స్టాగ్రామ్‌ లో రాశారు. తన భార్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “అద్భుతమైన నా జీవిత భాగస్వామి కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నీవు లేకుండా ఇది సాధ్యం కాదు” అని శుక్లా పోస్ట్ చేశారు. అంతరిక్షంలోకి వెళ్లేముందు చివరిసారిగా ఆమెతో ఉన్న ఒక ఫొటోను ఆయన ఇన్ స్టా లో షేర్ చేశారు.

మూడో తరగతి నుంచి పరిచయం..
శుభాన్షు శుక్లా, ఆయన భార్య కామ్నా.. లక్నోలోని ప్రైమరీ స్కూల్ లో 3వ తరగతి నుంచి క్లాస్ మేట్స్. కలసి ఒకే తరగతిలో కూర్చుని పాఠాలు విన్న వారిద్దరూ ఆ తర్వాత కలసి జీవిత ప్రయాణం మొదలు పెట్టారు. మొదట వీరిద్దరూ మంచి స్నేహితులు. తరగతిలో ఎప్పుడూ సిగ్గరిగా కనిపించే శుభాన్షు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి స్ఫూర్తినిస్తున్నారంటూ కామ్న గొప్పగా చెప్పేవారు. శుభాన్షు, కామ్న జంటకు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.


ఇక భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్‌ 9 రాకెట్‌ విజయవంతంగా అంతరిక్షంలోకి బయలుదేరింది. కొన్ని నిమిషాల తర్వాత వ్యోమనౌక, రాకెట్‌ నుంచి విడిపోయి భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం వీరి వాహక నౌక భూమి చుట్టూ స్థిర కక్ష్యలో తిరుగుతోంది. ప్రయోగం మొదలైన 28 గంటల తర్వాత భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) తో అనుసంధానం అవుతుంది. అక్కడ శుభాన్షు బృందం 14 రోజుల పాటు ఉంటుంది.

Related News

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

India’s Iron Dome: శత్రువుల గుండెలు అదిరేలా.. భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే?

Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఇక లేరు

Artificial Rain: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిరాయి కానీ, అంతా శూన్యం.. ఎక్కడంటే?

Delhi News: ఢిల్లీలో ఘోర ఘటన.. గోడ కూలి ఐదుగురు మృతి.. మరికొందరు శిథిలాల కిందే!

Draupadi Murmu: సెల్యూట్ ముర్ము జీ.. జోరు వానలోనూ అమరవీరులకు నివాళి.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Big Stories

×