Film industry:చిత్ర పరిశ్రమలో ఈమధ్య వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడుస్తున్నారు. ఇంకొంతమంది గుండెపోటుతో మరణిస్తూ అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్ లో ఉండగానే ఒక నటుడు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు విడవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఎవరు? అసలేం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ప్రముఖ కన్నడ రంగస్థలం కళాకారుడు, హాస్యనటుడు, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రాజు తాళికోటే గుండెపోటుతో కన్నుమూశారు. ఉడుపిలో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. సడన్గా గుండెపోటుకు గురయ్యారట. వెంటనే ఆయనను మణిపాల్ హాస్పిటల్ కి తోటి నటులు తీసుకెళ్లగా అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విషయం తెలుసుకున్న అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
also read:OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?