Viral Video: కొందరు యువతీయువకులు రూటు మార్చారు. సోషల్‌మీడియాలో హైలైట్ కావడం కోసమో తెలీదు. ఎక్కువ హిట్స్ కోసమే ఆ విధంగా చేస్తున్నారో తెలీదు. పబ్లిక్‌గా బరితెగిస్తూ రెచ్చిపోతున్నారు. వారివల్ల చాలామందికి సమస్యలు మొదలయ్యాయి. ఎవరేమనుకున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా అలాంటి ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ వెలుగుచూసింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
పెళ్లైన కొత్త జంట లేదా ప్రేమికులో తెలీదుగానీ బహిరంగంగా తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ జంట సినిమా స్టయిల్‌లో రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ జంట రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇరువైపులా ఉన్నవారి చూపు వారిపై పడింది. ఇక వెనుక నుంచి బైక్‌లు, కారుల మీద వెళ్లేవారి గురించి చెప్పనక్కర్లేదు. వారి చూస్తూ డ్రైవింగ్ చేస్తే రిస్కులో పడినట్టే.
ట్రాఫిక్ నిబంధనలను ఏమీ పట్టించుకోలేదు ఆ జంట. వెళ్తున్న బైక్‌పై ఓ జంటను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి ఫ్రెండ్ బైక్ ట్యాంక్‌పై కూర్చుని గట్టిగా కౌగిలించుకుంటోంది. ఈ దృశ్యాన్ని చూసి దారిన వెళ్ళేవారు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారులోకి కొందరు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గోరఖ్‌పూర్‌లోని రామ్‌గఢ్ తాల్ ప్రాంతానికి చెందినవారుగా చెబుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ జంట షికారు చేయడానికి వచ్చారని చెబుతున్నారు. బైక్‌పై ఒకరినొకరు నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. వైరల్ వీడియోపై పోలీసుల దృష్టి పడింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని గోరఖ్‌పూర్ పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ALSO READ: వారెవ్వా మొబైల్ బార్లు.. రమ్మన్న చోటుకు వచ్చేస్తాయి
ఈ జంటకు పోలీసులు భారీగా జరిమానా వేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లోని ప్రైవసీ లేదా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్‌ని ఇబ్బందిపెట్టే బదులు హనీమూన్ పేరిట దూరప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. పబ్లిక్‌గా రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చాలామంది ఇబ్బంది మారుతుందని అంటున్నారు.
ये कपल गोरखपुर में बाइक से सैर कर रहा था। एक दूसरे से फेस-टू-फेस बात करने का ये तरीका बेहतर है। फिर भी पता नहीं क्यों पुलिस ने इनका 2500 रुपए का चालान काट दिया। pic.twitter.com/tG2uaghF6i
— Bhadohi Wallah (@Mithileshdhar) August 23, 2025