Bollywood Actress : ఆయన ఓ ప్రముఖ దర్శకుడు అలాగే నిర్మాత.. కానీ ఓ నటితో చెప్పు దెబ్బలు తిన్నారు. ప్రస్తుతం ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు..? ఎందుకు నటి చేత చెప్పు దెబ్బలు తిన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar)అంటే తెలుగు వాళ్లకి తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్లో ఆమె చాలా ఫేమస్. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ కొన్ని సినిమాల్లో కీ రోల్స్ కూడా పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది.అలా మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 2023లో మిస్ హర్యానా(Miss Haryana) గా కూడా కిరీటం గెలిచింది.అలా రుచి గుజ్జర్ మోడలింగ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..
నిర్మాతను చెప్పుతో కొట్టిన బాలీవుడ్ నటి..
ఇక తాజాగా రుచి గుజ్జర్ చేసిన ఒక పని బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నటుడిగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా.. పేరున్న మాన్ సింగ్ (Man Singh)అంటే బాలీవుడ్ లో తెలియని వారు ఉండరు.ఆయన స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘సో లాంగ్ వ్యాలీ(So Long Valley)’ అనే హిందీ మూవీ జూలై 25న విడుదలైంది.. ఇక ఈ సినిమాని థియేటర్లో చూడడం కోసం మాన్ సింగ్ ముంబై (Mumbai) లో ఉన్న సినీ పోలీస్ థియేటర్ కి వచ్చి సినిమా చూసి వెళ్లారు.అలా వెళ్తున్న సమయంలో నటి రుచి గుజ్జర్ తన చెప్పుతో కొట్టింది.మరి సైలెంట్ గా వెళుతున్న నిర్మాత మీదికి రుచి గుజ్జర్ చెప్పు ఎందుకు విసిరిందనే డౌట్ మీకు రావచ్చు.
అసలు విషయం తెలిస్తే షాక్..
అయితే సో లాంగ్ వ్యాలీ నిర్మాత మాన్ సింగ్ ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదట. ఇప్పటికే 25 లక్షల వరకు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా లేట్ చేస్తున్నారని చాలా సార్లు రుచి గుజ్జర్ అడిగిందట. కానీ ఆయన స్పందించకపోవడంతో రుచి గుజ్జర్ తన కోపాన్ని ఇలా నిర్మాత మీదకి చెప్పులు విసిరి ప్రదర్శించింది. సినిమా చూసి థియేటర్ నుండి వస్తున్న మాన్ సింగ్ ని రెమ్యూనరేషన్ చెల్లించాలంటూ గట్టిగా అడిగింది.కానీ నిర్మాత మాన్ సింగ్ స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రుచి గుజ్జర్ అందరి ముందే తన చెప్పుతో కొట్టింది.ఇక దాడి నుండి నిర్మాత తప్పించుకునే సమయంలో ఈ సినిమాకి సహనిర్మాతగా చేసిన కరణ్(Karan) అడ్డు పడ్డారు. ఆ తర్వాత రుచి గుజ్జర్ మీదికి ఆవేశంతో మండి పడగా ఆమె వెనకే ఉన్న చాలామంది నిర్మాతలని గాడిదల మీద కూర్చుని ఉన్న ప్లకార్డులతో చూపించారు.
అలాంటి ఫ్లకార్డులతో నటి నిరసన..
అలా రుచి గుజ్జర్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో నిర్మాతలను గాడిదల మీద కూర్చున్నట్టు సింబాలిక్ గా చూపెట్టి వెరైటీగా నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో రుచి గజ్జర్ చేసిన పని బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక చాలా రోజుల నుండి తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మ్యూజిక్ ఆల్బమ్ లకు సంబంధించి దాదాపు 25 లక్షల వరకు డబ్బులు ఇంకా ఇవ్వలేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ నటి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్లు రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి. కానీ చెప్పులతో కొడితే ఇస్తారా అని అంటుంటే.. మరికొంతమందేమో ఆ నిర్మాతకు ఈ నటి చేసిన పనే కరెక్ట్ అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
ALSO READ:Telangana: ఘనంగా ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ ఆరంభం.. ముఖ్య ఉద్దేశం అదే అంటూ!
?utm_source=ig_web_copy_link