Anchor Suma Assets and Net Worth: తెలుగు రాష్ట్రా ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అసవరం లేని పేరు.. సుమ కనకాల. ఇలా కంటే యాంకర్ సుమ అంటేనే ఫుల్ క్రేజ్. దశాబ్దాలుగా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. ఆమె తర్వాత ఎంతో మంది మేల్, ఫీమేల్ యాంకర్స్ వచ్చారు. కానీ, సుమ బీట్ చేసే స్థాయికి ఇప్పటికీ ఎవరూ చేరుకోలేదు. ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరోవైపు మూవీ ఈవెంట్స్ చేస్తోంది. ఏ స్టార్ హీరో సినిమా ఈవెంట్ అయినా.. సుమ యాంకర్ గా ఉండాల్సిందే.
బుల్లితెర మహారాణిలా..
ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్ అయినా.. సుమ యాంకర్, హోస్ట్. జక్కన్న ఏరికోరిక తనని యాంకర్ పెట్టుకుంటారు. మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగులో ఆనర్గళంగా మాట్లాడటమే కాకుండా.. తనదైన స్టైల్లో పంచులు, కామెడీ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆమె స్టేజ్ పై ఆమె కనిపిస్తే చాలు.. అందరిలో తెలియని జోష్. అందుకే ఆమె యాంకరింగ్ కి సాధారణ ప్రజలే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం అభిమానులు ఉన్నారు. బుల్లితెర ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ.. ఆమె లుక్, యాంకరింగ్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. అంతగా తన వాక్చాతార్యంతో ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
మాటలతో మ్యాజిక్
ప్రస్తుతం బుల్లితెరపై సుమ కెరీర్.. మూడు పూలు, ఆరు కాయలు అన్నట్టుగా ఉంది. తను ఒక్క ఈవెంట్ కి లక్షల్లో పారితోషికం తీసుకుంటుంది. ఇక చిన్న చిన్న కార్యక్రమాలైలే గంటకు చొప్పన చార్జ్ చేస్తుంది. ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న సుమ.. ఆస్తులు వివరాలు అందరిని షాకిస్తున్నాయి. ఇక సుమ కూడా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. బడా దర్శక, నిర్మాతలైన తనదైన మాటల చతురతతో మెప్పిస్తుంది. స్టేజ్ సమయస్ఫూర్తిగా ఉంటూ మాటలతో మ్యాజిక్ చేస్తుంది. అంతగా ఆడియన్స్, సినీ సెలబ్రిటీల్లో మనసులను దొచుకుంది. ఎంతోకాలంగా స్టార్ యాంకర్ గా రాణిస్తోన్న ఆమె వివాదాలకు, విమర్శకులకు దూరంగా ఉంటుంది.
ఒక్కో ఈవెంట్ కి ఎంత తీసుకుంటుందంటే..
ఇప్పటీ వరకు సుమ ఎలాంటి వివాదాల్లోనూ కనిపించలేదు. ఇక ఆమెను ట్రోల్ చేసే ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అంతగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. యాంకర్లలో అత్యధిక పారితోషికంగా తీసుకునే వారిలో సుమనే టాప్. ఆమె ఒక్కొక్కొ షో, ఈవెంట్ కి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు తీసుకుంటుంది. అలా ఆమె నెల ఆదాయం సుమారు రూ. 15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు ఉంటుందట. రెండు చేతుల బాగానే సంపాదిస్తున్న సుమ ఆస్తులను కూడా భారీగా కూడబెట్టినట్టు ఇండస్ట్రీలో తరచూ గుసగుసల వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె భర్త ఓ ఫ్లాట్ వివాదంలో నిలవడంతో అంత సుమ ఆస్తులను ఆరా తీస్తున్నారు.
సుమ ఆస్తులు ఇవే..
దీంతో ఆమె మొత్తం ఆస్తులు రూ. 41.85 కోట్ల నుంచి రూ. 83.70 కోట్లగా వరకు ఉండచ్చని సమాచారం. 2024లో జరిపిన ఓ సర్వే ప్రకారం సుమ ఆస్తులు ఈ స్థాయిలో ఉన్నట్టు ప్రముఖ సంస్థ తమ కథనంలో పేర్కొంది. దీంతో ఆమె ఆస్తులు తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. యాంకర్ గానే ఈ స్థాయిలో సంపాదించిన సుమ ఇక సినిమాల్లో అలాగే కొనసాగితే ఇంకా ఏ రేంజ్ లో సంపాదించేదో అంతా చర్చించుకుంటున్నారు. కాగా సుమ భర్త రాజీవ్ కనకాల.. ఓ భూమి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన పేరుపై లేని ప్లాట్ ని ఉన్నట్టు చూపించిన ఓ నిర్మాతకు అమ్మినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయమైన రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు అందాయి. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.