Hyderabad:ప్రముఖ ఆఫ్ షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థగా పేరుగాంచిన బైండ్జ్.. హైటెక్ సిటీ వేదికగా ప్రారంభించడం జరిగింది. భారత్లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ నగరంలో తమ రెండవ డెలివరీ సెంటర్ ను ప్రారంభించారు. ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైయన్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యూహాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రారంభం కంపెనీ జాతీయ వృద్ధితోపాటు ప్రపంచ స్థాయిలో కొనసాగుతున్న ప్రమాణంలో మరో కీలక రాయిని సూచిస్తుంది.
ముఖ్యంగా నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్యలో ఉన్న ఈ నూతన వేదిక క్లైంట్లకు అధిక నాణ్యత, అత్యాధునిక సాంకేతికత అలాగే ఫైనాన్షియల్ పరిష్కారాలను అందించే బైండ్జ్ సామర్ధ్యాన్ని బలపరుస్తుంది. పన్ను, సలహా, వాల్యుయేషన్, క్లైంట్ అకౌంటింగ్ సేవలు , కంప్లైయన్స్ టెక్నాలజీతో సహా విస్తరించిన సేవా మార్గాలకు ఈ కేంద్రం మద్దతు ఇస్తుందని సమాచారం. బైండ్జ్ విషయానికి వస్తే.. ఇది ఫైనాన్షియల్ కన్సల్టింగ్ లో కొత్త దశను అనుసరిస్తోంది. దీని ప్రత్యేకమైన బిల్డ్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ మోడల్ తో సంస్థ పనితీరును ఆప్టమైజ్ చేస్తూ ప్రమాదాలను తగ్గించే పరిష్కారాలను చూపెడుతుంది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయ ఆఫ్ షోరింగ్ విధానాలకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది.
దీనికి దేశవ్యాప్తంగా ఉన్న పోటీ బలమైన విద్యా నైపుణ్యాలతో సహా ప్రపంచ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ పరిస్థితులు బైండ్జ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. నాణ్యత ఆధారిత డెలివరీ, ప్రత్యక్ష క్లైంట్ అనుసంధానం పై దృష్టి సారించి బైండ్జ్ ఆపరేటింగ్ మోడల్ లు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది . అనువైన పని గంటలు, సమగ్ర కుటుంబ భీమా, ట్రావెల్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు ఉద్యోగుల శ్రేయస్సు పట్ల దాని నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి..
ఇకపోతే హైదరాబాదులో ఈ బైండ్జ్ సేవలు ప్రారంభిస్తున్న సందర్భంగా బైండ్జ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ శిరీష్ కొరడా మాట్లాడుతూ… ఈ విస్తరణ మా క్లైంట్ కి వెంటనే ప్రతిస్పందనాత్మక, స్కేలబుల్ డెలివరీని అందించడంలో మా నిబద్ధతకు ప్రతిబింబం. హైదరాబాద్ అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న సమూహాన్ని, బలమైన మౌలిక సదుపాయాలను, వ్యూహాత్మకత కనెక్టివిటీని అందిస్తుంది. ఇవి మా భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే కీలక అంశాలు అంటే తెలిపారు.
అలాగే క్వాలిటీ చీఫ్ యోగేష్ పాండిచ్చేరి మాట్లాడుతూ.. మా డెలివరీ ఆర్కిటెక్చర్ అనుకూలత కోసం నిర్మించబడింది. ఈ హైదరాబాదు నూతన కేంద్రం చేరిక వేగంగా టైం జోన్ సెన్సిటివ్ పని భారాలను నిర్వహిస్తూ…ప్రతి క్లైంట్ అనుసంధానంతో నిబద్ధతలను నిలబెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది అంటూ ఆయన తెలిపారు. మా క్లైంట్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి , మా సేవలను ఉపయోగించుకోవడం ద్వారా వారి బాటమ్ లైన్ ను మెరుగుపరచడంలో సహాయపడడమే మా లక్ష్యం అంటూ తెలిపారు.
ALSO READ:Urvashi Rautela: ఫస్ట్ ఇండియన్ మహిళగా అరుదైన గుర్తింపు.. ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ రేంజ్ లో!