Bollywood:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతోమంది సెలబ్రిటీలు అలరిస్తున్నారు. అయితే వీరంతా కూడా ముఖానికి రంగు వేసుకొని ప్రేక్షకులను అలరించడమే కాదు.. తమలోని గొప్ప టాలెంట్ ను అప్పుడప్పుడు వెలికితీస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా అనేది ఒక ప్యాషన్ అయితే.. మరొకవైపు తమ అభిరుచులను కూడా నెరవేర్చుకుంటూ సంతృప్తి పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం మనకు తెరపై కనిపిస్తూ తమ గ్లామర్ తో, అందాలతో, నటనతో అబ్బురపరుస్తున్న ఎంతోమంది హీరోయిన్స్ ని చూస్తూనే ఉన్నాం. అయితే వీరిలో దాగివున్న హిడెన్ టాలెంట్ మాత్రం ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెరపై చిలిపిగా కనిపించే వీరిలోనా ఇంత టాలెంట్ ఉన్నది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, మధుర అనుభవాలను పుస్తక రూపంలో బంధించి, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక వారెవరో కాదు బాలీవుడ్ బ్యూటీస్.. ప్రముఖ సెలబ్రిటీలు గా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది ఎప్పుడూ ఆడిషన్లు, షూటింగ్లు, మీటింగ్ లతో కూడిన బిజీ లైఫ్ లో కూడా స్ఫూర్తినిచ్చే రచనలోనూ రాటుదేలారు. ఇక వారెవరు? ఎలాంటి రచనలు చేశారు? ఇప్పుడు చూద్దాం.
ప్రియాంక చోప్రా..
గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో SSMB 29 సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న ఈమె.. గతంలో “అన్ ఫినిష్డ్”(Un Finished) అనే ఒక పుస్తకం రచించింది. ఈ పుస్తకంలో ప్రియాంక తన జీవితంలోని ముఖ్యమైన క్షణాలను, అలాగే నటి, నిర్మాతగా, యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేయడం, అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనస్తో ఆమె వివాహం, ఇలా 20 ఏళ్ల కెరీర్ ను వివరించింది. 2021 ఫిబ్రవరి 9న ఈ పుస్తకం ప్రచురించబడగా.. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ విడుదల చేసింది. ఇక ఈ పుస్తకం యునైటెడ్ స్టేట్స్లో ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చోటు దక్కించుకుంది. అంతే కాదు భారతదేశంలో నీల్సన్ బుక్కు స్కాన్ బెస్ట్ సెల్లర్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
అలియా భట్ ..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అలియా భట్ (Alia Bhatt) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇప్పుడు వార్ 2 లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు నటిగా.. మరొకవైపు బిజినెస్ ఉమెన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె..”ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్” (Ed Finds a Home) అనే పుస్తకాన్ని రచించింది. సానుభూతి, దయ, స్నేహం ప్రాముఖ్యతను తెలియజేసే ఈ పుస్తకం పిల్లల కోసం రాసింది. ఇందులో ఎడ్ అనే ఇంటి కోసం వెతుకుతున్న కుక్క.. ఆలియా అనే అమ్మాయిని కలుస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండడమే కాకుండా సహాయం చేసుకుంటారు. ఈ పుస్తకాన్ని కూడా పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది.
కరీనాకపూర్..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కరీనాకపూర్ (Kareena Kapoor) కూడా ప్రెగ్నెన్సీ బైబిల్ (pregnancy Bible) అనే పుస్తకాన్ని రచించింది. ఇందులో తన రెండు ప్రెగ్నెన్సీలకు సంబంధించిన విషయాలను కరీనాకపూర్ పొందుపరిచింది.
హుమా ఖురేషి..
హుమా ఖురేషి (Huma Qureshi) ‘ థింగ్స్ వి డోంట్ టెల్ ద పీపుల్ వి లవ్” (things we don’t tell the people we love) అనే పుస్తకాన్ని రచించింది.
మనీషా కొయిరాలా:
ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న మనీషా కొయిరాలా(Manisha Koirala) కూడా “హీల్డ్ : హౌ కాన్సర్ గివ్ మీ ఏ న్యూ లైఫ్” అనే పుస్తకాన్ని రచించింది. ఇందులో క్యాన్సర్ బారిన తాను ఎలా పడింది? ఆ క్యాన్సర్ నుంచి ఎలా బయటపడింది? అనే విషయాలను పొందుపరిచింది.
ALSO READ:Kalpika Ganesh: మరో వివాదంలో చిక్కుకున్న కల్పిక గణేష్.. బూతులతో రెచ్చిపోతూ!