Salman Khan..ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాలు దాటినా వివాహానికి నోచుకోని ఈయన.. ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు బిష్ణోయ్ వర్గం నుండి తప్పించుకొని తిరుగుతూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరోగ్య సమస్యలపై నోరువిప్పిన సల్మాన్ ఖాన్..
ఇక ఇలా హత్యాయత్నం, రౌడీల దాడి అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సల్మాన్ ఖాన్.. ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “నటుడిగా సినిమా రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు తరచూ గాయాలు కూడా అవుతుంటాయి. ఈ క్రమంలోనే నేను ట్రైజెమినల్ న్యూరల్జియా (ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి), ఏవీ మాల్ఫోర్మేషన్ (రక్తనాళాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితి), బ్రెయిన్ ఎన్యోరిజం (మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య) ఇలా ఈ సమస్యలు ఉన్నప్పటికీ నేను నటనను కొనసాగిస్తున్నాను” అంటూ తెలిపారు. ఇలా మూడు భయంకరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా నటనను కొనసాగించడంతో సల్మాన్ ఖాన్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కు ఇన్ని వ్యాధులు ఉన్నాయని తెలిసి, అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ కెరియర్
బాలీవుడ్ నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సల్మాన్ ఖాన్ కి ఆసియాలోనే అరుదైన గుర్తింపు ఉంది. విలక్షణమైన నటుడిగా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.భారతీయ నటుడిగా, నిర్మాతగా, టీవీ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ప్రఖ్యాత గాంచారు. ఈయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. ఈయన తండ్రి సలీం.. ప్రముఖ స్క్రీన్ రచయిత.. సల్మాన్ ఖాన్ తొలిసారి 1988లో వచ్చిన ‘బీవీ హోతో అయిసీ ‘ అనే సినిమాలో సహాయక పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఆ తర్వాత సూరజ్ దర్శకత్వంలో ‘ మైనే ప్యార్ కియా’ అనే సినిమాతో హీరోగా మారారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా ఇటు సౌత్ సినిమాలలో కూడా జస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అందరిని పట్టుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ తొలినాల జీవితం..
ప్రముఖ స్క్రీన్ రచయిత సలీం ఖాన్ ఆయన మొదటి భార్య సుశీల చరక్ మొదటి సంతానమే సల్మాన్ ఖాన్. ఈయన తండ్రి తరఫు పూర్వికులు ఆఫ్ఘనిస్తాన్ కి చెందినవారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో స్థిరపడ్డారు. సల్మాన్ ఖాన్ తల్లి మహారాష్ట్రకు చెందిన వారు. ఈమె పూర్వీకులు జమ్మూ కాశ్మీర్ నుండి ఇక్కడికి వలస వచ్చారట. ఇకపోతే సల్మాన్ ఖాన్ అటు హిందూ గాను ఇటు ముస్లిం గాను కూడా చెప్పుకుంటున్నారు.
ALSO READ:Ghaati Movie: అనుష్కకు ఘోర అవమానం.. పేరుకే మెయిన్ లీడ్.. 4నిమిషాల సాంగ్ లో ఎన్ని సెకెన్లు ఉంది?