BigTV English

Celebrities : ఈ ఏడాది ఆస్తులు అమ్ముకున్న సినీతారలు.. కోట్ల లాభాలు..

Celebrities : ఈ ఏడాది ఆస్తులు అమ్ముకున్న సినీతారలు.. కోట్ల లాభాలు..

Celebrities : ఇండస్ట్రీ లోకి వచ్చిన వారికి అదృష్టం ఉంటే ఆటోమేటిక్గా ఆస్తులు కూడా పెరుగుతాయని అందరికీ తెలిసిందే. చిన్న సినిమా అయినా సరే అదృష్టం కలిసి వస్తే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. అలాగే సినీ తారల విషయంలో కూడా అదృష్టం ఉంటేనే హిట్ సినిమాలు పడుతున్నాయి. ఇండస్ట్రీ మొత్తం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు హీరోయిన్లు దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. హిట్ సినిమాలు పడుతున్నప్పుడే ఆస్తులను కూడబెడుతున్నారు. కొంతమంది ఏమో వ్యాపారాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. ఇక కొంతమంది ఏమో గతంలో కొన్న ఆస్తులను అమ్మేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ ఏడాది ఆస్తుల నమ్ముకుని కోట్లు కూడబెట్టిన సినీ తారలు ఎవరో ఒకసారి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..


ఈ ఏడాది ఆస్తులను అమ్ముకున్న స్టార్స్ వీళ్లే.. 

ఏడాది టాలీవుడ్ సినీ తారల కన్నా బాలీవుడ్ స్టార్స్ ఎక్కువ ఆస్తులను అమ్ముకున్నారు. బాలీవుడ్ లోని సినీ తారలు ఒక సినిమా చేస్తే ఆ సినిమాకు వచ్చిన లాభాలను పలు వ్యాపారాల్లో పెడుతూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ హోదాలో ఉన్న చాలామంది బిజినెస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా రెమ్యునరేషన్ తో పాటూ అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. చాలామంది సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.. అయితే ఈ ఏడాది ఆస్తుల అమ్ముకొని కోట్లు కూడా పెట్టిన సినీ తారల్లో బాలీవుడ్ స్టార్స్ ఎక్కువ. మరి వారెవ్వరంటే..


ప్రియాంక చోప్రా..

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి బిజీ హీరోయిన్ అయింది. ఇప్పుడు మాత్రం హాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.. ప్రస్తుతం ఈమె తెలుగులో మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రియాంక చోప్రాకు ఓబెరాయ్ స్కై గార్డెన్లో 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆమె ఈ నాలుగు ఫ్లాట్ ల ద్వారా భారీగా ఆదాయం పొందింది.

అమితాబ్ బచ్చన్.. 

బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ సినిమాలు , రియాలిటీ షోల నుంచి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆస్తులను అమ్మడం ద్వారా అంతకుమించి ఆదాయం పెంచుకున్నారు.. టైమ్స్ అఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం.. అమితాబ్ ఏడాది ఆస్తులు నమ్మి కోట్లు లాభాలను పొందినట్లు తెలుస్తుంది. ఓషివారాలో తన డూప్లెక్స్ను విక్రయించారు. నాలుగేళ్ల క్రితం దీన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో కేవలం 31 కోట్లతో అప్పట్లో కొనుగోలు చేసిన అమితా తో కొనుగోలు చేసిన అమితాబ్ ఇప్పుడు 83 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది..

అక్షయ్ కుమార్.. 

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ఆస్తులు విలువ వెలకట్టలేనిది. ఇప్పటివరకు సంపన్నులలో ఒకరిగా కొనసాగుతున్న ఈయన ఈ ఏడాది తన ఆస్తులను అమ్ముకొని మరిన్ని కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తుంది. అక్షయ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు తన 6 ఆస్తులను విక్రయించారు. ఇందులో అపార్ట్మెంట్లు , ఆఫీస్ స్పేస్ కూడా ఉన్నాయి. దీని ద్వారా 100 కోట్లకు పైగా లాభం వచ్చింది.. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Also Read : అక్షయ్ కు చుక్కలు చూపించిన అవని.. అడ్డంగా ఇరుక్కున్న పల్లవి..

వీళ్లు మాత్రమే కాదు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఆస్తులను అమ్మినట్లు తెలుస్తోంది. అలాగే ఎప్పుడూ తన సినిమాల గురించి చర్చల్లో ఉండే బాలీవుడ్ నటుడు జితేంద్ర ఏడాది తన ఆస్తులను అమ్మి కోట్లు సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి బాలీవుడ్ తారలు ఈ ఏడాది ఆస్తులను బాగానే కూడా పెట్టారు.

 

Related News

Baaghi 4Trailer: రక్తంతో నిండిన ప్రేమ కథ…హై వోల్టేజ్ యాక్షన్ గా బాఘీ 4 ట్రైలర్!

Hero Darshan: హీరో దర్శన్ భార్యకు వేధింపులు.. అశ్లీల మెసేజ్లతో!

OG Movie: రికార్డులు ఓకే.. రేట్లు పెంచితేనే కష్టం

OG Bookings : ఓజీ సునామీ… రిలీజ్‌కు ముందే పుష్ప 2 రికార్డులు బ్రేక్

Jayakrishna: అన్న కొడుకు ఎంట్రీ.. రాజకుమారుడు తరహాలో ప్లాన్ చేసిన మహేష్

Tribanadhari Barbarik: ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉదయభాను మూవీ టీం.. ఆ 2 రోజులు ఫ్రీ టికెట్స్!

Big Stories

×