Intinti Ramayanam Today Episode August 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. వ్రతానికి వచ్చిన ఆడవాళ్లు పల్లవి ప్లాన్ ప్రకారం అవని నీ దారుణంగా అవమానిస్తారు.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి వాళ్ళ మాటలు విని నోరు మూయండి అంటూ రెచ్చిపోతుంది.. అందరికీ క్లాస్ పీకుతుంది. అసలు మీరేంటి మీ బతుకులు ఏంటి మీరు నా కోడలు అనే వాళ్ళ అని పార్వతి వచ్చిన వాళ్లని దుమ్ము దులిపేస్తుంది. ఇంట్లో పూజ జరుగుతుంది కాబట్టి మీరు బ్రతికి పోయారు. లేకుంటే అంటే చెప్పుతో కొట్టేదాన్ని అని పార్వతీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తుంది. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోండి అని పార్వతి అరుస్తుంది.. వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే ఇంట్లోని వాళ్ళందరూ చప్పట్లు కొట్టి పార్వతి చేసిన మంచి పనికి మెచ్చుకుంటారు..భానుమతి లోపలికి వెళ్లి కమలాకర్ ఫోటోతో మాట్లాడుతుంది.. అయ్యా చూసావా ఎంత ఆనందంగా ఉందో.. అవని పై కోపం పోయింది పార్వతికి. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పార్వతికి ఇచ్చిన మాట ప్రకారం అక్షయ పూజకు వచ్చేలా చేస్తుంది అవని. అక్షయ్ ఈ హడావిడిగా ఇంటికి వస్తాడు. నాకోసం ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.. అక్షర రావడం చూసిన అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. పల్లవి శ్రియాలు మాత్రం షాక్ లో ఉండిపోతారు. నేను ఇక్కడికి వచ్చింది నా బాస్ కోసం అని తెలిస్తే వీళ్లు ఏమనుకుంటారు అని మౌనంగా ఉండిపోతారు. అప్పుడే ఇంటికి వాళ్ళ బాస్ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ బాస్ ని పరిచయం చేస్తాడు.. అయితే రాజేంద్రప్రసాద్ కాలేజీ ఫ్రెండ్ కావడంతో పార్వతి వాళ్ళిద్దరి సాన్నిత్యం చూసి కుళ్ళుకుంటుంది. నీ భార్యని కూడా పరిచయం చేయమని మేడమ్ అడుగుతుంది. అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్లి వేడుకుంటాడు.
మా మేడం నిన్ను పిలుస్తుంది రా అని ఎంత బ్రతిమలాడినా అవని అక్షయ్ నీకు కావాలని ఆడుకుంటుంది. నాకు లవ్ యు చెప్పాలి అని మొండికేసి అడుగుతుంది. అవని చెప్పినట్లు అక్షయ్ ఎంత చేసినా కూడా అవని రానని అంటుంది. నా గురించి గొప్పగా చెప్తే నేను వస్తానని అంటుంది. ఇక అవని చెప్పినట్టు అక్షయ్ చెప్తానని అంటాడు. దాంతో అవని వాళ్ళ మేడం దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్షయ్ అవనీని పొగడడం చూసి పల్లవి శ్రియ ఇద్దరు షాక్ అవుతారు.
ఇప్పటివరకు బాగానే ఉన్న బావగారు సడన్ గా అవని భజన ఎందుకు చేస్తున్నారా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ్ అవి నేను అర్థం చేసుకున్నాడని పార్వతి సంతోషపడుతుంది. భానుమతి కూడా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది. అప్పుడే రాజేంద్రప్రసాద్ అవనీని ఒకసారి మాట్లాడాలని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఏమైంది అవని ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు సడన్గా ఏమైంది అని అడుగుతాడు.
ఆయన ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్లాడో తెలుసుకున్నాను మావయ్య.. అక్కడ బాసు ఫ్యామిలీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలిసి నేను మొదట షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆమె మంచి మనసుని చూసి సంతోషపడ్డాను. మా అనాధాశ్రమం వార్డును ఆమె గురించి అన్ని విషయాలను చెప్పింది. అయితే నేను ఆమెకు పూజలు అంటే ఇష్టం అని తెలుసుకుని ఆమెను ఇక్కడికి పిలిపించాను. అలా ఆయన కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్తుంది. ఇక ఆమె నా ఫ్రెండ్ అన్న విషయం రాజేంద్రప్రసాద్ అవనితో చెప్తాడు. కానీ అవని మాత్రం నాకు ముందే తెలుసు మావయ్య మీరిద్దరూ పేర్లు పెట్టి పిలుచుకున్నప్పుడే అర్థమైపోయింది అని అంటుంది.
Also Read :Illu Illalu తప్పించుకున్న ప్రేమ.. నర్మద తోడుగా రామరాజు..అయ్యో చందు బుక్కయ్యాడే..
అవని నీ శ్రీకరు పక్కకు తీసుకొని వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అన్నయ్య చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్న అతను మనకు ఒకసారి దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు కదా వదినా.. ఇప్పుడు అతను నా దగ్గరే ఉన్నాడు నా ఫ్రెండ్ ఇంట్లో సేఫ్ గా ఉంచాను. అతని ఇక్కడికి తీసుకొని వస్తే అసలు విషయం బయట పడుతుంది కదా.. పల్లవి వాళ్ళ నాన్న చేస్తున్న మోసాలు బయట పడతాయి కదా అని శ్రీకర్ అంటాడు. ఆ మాటలు పల్లవి విని షాక్ అవుతుంది.. నీ ఇష్టం శ్రీకర్ నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయు అని అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో పల్లవి బండారం బయటపడబోతుందా? లేకుంటే పల్లవి ఇదంతా కలగనిందా అన్నది చూడాలి..