Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇంటికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన ఇంట్లో బాంబ్ పెట్టినట్లు కాల్ వచ్చినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు.. దాంతో చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఆదివారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఈ బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో మూడు బాండ్ స్క్వార్డ్ బృందాలు, స్నిఫర్ డాగ్స్ మొత్తం మూడు టీమ్ లు విజయ్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అసలు ఈ బాంబ్ బెదిరింపు నిజమా? పోలీసులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బాంబ్ బెదిరింపులు ఎందుకు..?
హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓసారి విజయ్ ఇంట్లో బాంబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించాడు.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది టీవీకే పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌ని ఇప్పటికే ప్రకటించింది తమిళగ వెట్రి కళగం పార్టీ. వచ్చే ఏడాది నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోనే తన జీవితాన్ని గడిపేందుకు రెడీ అవుతున్నాడు విజయ్.. ఈ విషయాన్ని తానే స్వయంగా అనౌన్స్ చేశారు. తమ హీరో రాజకీయాల్లోకి రాబోతున్నాడని అభిమానులు ఎంతో ఆత్రుత వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇలాంటివి వినిపించడంతో టెన్షన్ పడుతున్నారు.
Also Read : బుల్లి రాజు క్రేజ్ వేరే లెవల్.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ కోటా..?
విజయ్ సినిమాల విషయానికొస్తే..
విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా ‘జన నాయగన్’ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇందులో మమితా బైజు, పూజా హెగ్దే, సన్నీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. గోట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి టాక్ ను అందుకుంటుందని సినీ వర్గాల్లో టాక్.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..