Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ (Aamir Khan) ఇంటికి తాజాగా 25 మంది కలెక్టర్లతో కూడిన బృందం రావడం అభిమానులలో ఊహాగానాలకు దారితీసింది. ముఖ్యంగా కలెక్టర్లతో పాటు పోలీస్ బృందం కూడా అమీర్ ఖాన్ ఇంటికి చేరుకోవడంతో పలు చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ వీడియోలో పోలీస్ వాహనాలు అమీర్ ఖాన్ ఇంటి ముందు మోహరించడం మనం చూడవచ్చు. అయితే ఈ ఆకస్మిక సందర్శన వెనుక అసలు కారణం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు..
ఇదిలా ఉండగా దాదాపు 25 మంది ఐపీఎస్ అధికారులు ముంబై బాంద్రాలోని అమీర్ ఖాన్ ఇంట్లో ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే ఈ బృందం అమీర్ ఖాన్ ను కలవడానికి వెళ్లిందని ఒక నివేదిక సూచించినప్పటికీ.. అటు అమీర్ ఖాన్ బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ ఫోటోలు, వీడియోలు మాత్రం అభిమానులలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే అమీర్ ఖాన్ పీ.ఆర్ టీమ్ ను సంప్రదించే ప్రయత్నం చేయగా.. అసలు కారణం తమకు ఇంకా తెలియదని, ఈ విషయంపై అమీర్ తో మాట్లాడాలి అని స్పష్టం చేశారు. మొత్తానికైతే అమీర్ ఖాన్ ఇంటికి సడన్గా 25 మంది కలెక్టర్లతో పాటు పోలీస్ బృందం కూడా రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై అమీర్ ఖాన్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
మెల్ బోర్న్ ఫిలిం ఫెస్టివల్ కి ముఖ్యఅతిథిగా అమీర్ ఖాన్..
ఇదిలా ఉండగా మరొకవైపు అమీర్ ఖాన్ కు 16వ ఎడిషన్ ఫెస్టివల్ లో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి అవకాశం లభించింది. అసలు విషయంలోకి వెళ్తే ఆగస్టు 14 నుండి 24 వరకు జరగబోయే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM ) 2025 కి త్వరలో అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
IFFM పై స్పందించిన అమీర్ ఖాన్..
ఇదే విషయంపై అమీర్ ఖాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. “మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి ఆహ్వానం అందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది భారతీయ సినిమా స్ఫూర్తిని, దాని వైవిధ్యం అలాగే సంపదను నిజంగా గౌరవించే ఉత్సవం లాంటిది. ప్రేక్షకులతో సంభాషించడానికి , నా అత్యంత విలువైన మాటలను పంచుకోవడానికి, సినిమా శక్తిని గౌరవించే చర్చలలో పాల్గొనడానికి నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. నేను నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇక్కడ స్పాట్ లైట్ ప్రెజెంటేషన్ తో ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నారు. ఈ చిత్రం చాలామంది హృదయాలను తాకింది. మెల్ బోర్న్ తో నా ప్రయాణాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ అమీర్ ఖాన్ తెలిపారు.
అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు..
ఇదిలా ఉండగా తాజాగా అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా జూన్ 20వ తేదీన విడుదలయ్యింది. విడుదలైన నెల తర్వాత దాదాపు ఇండియాలోనే రూ.165 కోట్ల నికర వసూళ్ళను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన ఈ సినిమాకి.. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెనీలియా(Genelia D’Souza) కీలక పాత్ర పోషించింది . ఈ సినిమా తర్వాత భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా దర్శకుడు రాజకుమార్ హిరానీ రూపొందిస్తున్న బయోపిక్ చిత్రంలో అమీర్ ఖాన్ నటిస్తున్నారు.
also read:Sobhita – Naga Chaitanya: శోభిత – నాగచైతన్య పెట్టుకున్న కండిషన్స్ అవే!
?utm_source=ig_web_copy_link