Bulli Raju : సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చెప్పులు అరిగేలా తిరగాలని చాలామంది ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఒకవేళ అదృష్టం బాగుండి అవకాశాలు వస్తే వాటిని కాపాడుకోవడం కోసం కష్టపడాలి అని అంటుంటారు. ఈ మధ్యకాలంలో ఒక్క సినిమాతో క్రేజ్ ని సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా నటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బుల్లి రాజు ఒకడు.. పిట్టు కొంచెం కూత ఘనం అన్న సామెతకు తగ్గట్లుగా ఈ కుర్రాడు తన టాలెంట్ తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. తాజాగా ఈ కుర్రాడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. సినిమాలను లైన్లో పెట్టుకోవడం మాత్రమే కాదు.. అటు రెమ్యూనరేషన్ని కూడా భారీగా పెంచినట్లు తెలుస్తుంది..
పది సినిమాలను లైన్లో పెట్టిన బుల్లిరాజు..
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో స్పెషల్ రోల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు నటించారు. వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ కొడుకుగా ఈ సినిమాలో కనిపించాడు. స్టోరీ ఒక ఎత్తు అయితే బుల్లి రాజు యాక్టింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. దాంతో తంతే బూరెలు బుట్టలో పడ్డట్లు బుల్లి రాజు దశతిరిగిపోయింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా సినిమా అవకాశాలని అందుకుంటున్నాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈ మాత్రం క్రేజ్ ని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు.. ప్రస్తుతం ఈ కుర్రాడి చేతిలో పది సినిమాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోని ఆ సినిమాలో రిలీజ్ కాబోతున్నట్లు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్క సినిమాతో ఇంత క్రేజ్ ను సంపాదించుకోవడం మామూలు విషయం కాదని నెటిజెన్లు బుల్లి రాజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ శృతి ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..?
ఒక్కో సినిమాకు కోటి..
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఓ రీల్ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు.. ఆ వీడియో చూసిన అనిల్ రావిపూడి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో రేవంత్ కెరీర్ మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డిమాండ్ బాగా ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడంట. ఒక్క రోజుకు రూ.60 వేల నుంచి పాత్రను బట్టి రూ.లక్ష దాకా డిమాండ్ చేస్తున్నాడంట.. కానీ ఇప్పుడు ఈ లెక్క మారిందని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. బుల్లి రాజు ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకు చార్జ్ చేస్తున్నాడు అంటూ సమాచారం. హీరోయిన్ల కూడా అంత చెల్లించడం కష్టమే అనుకున్న ఈ రోజుల్లో బొల్లి రాజు కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే అతనికున్న డిమాండ్ అలాంటిది. ఏది ఏమైనా కూడా బుల్లి రాజు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ కుర్రాడు 10 సినిమాలకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్..