Boycott HHVM:దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ‘బ్రో’ సినిమాతో డిజాస్టర్ చవి చూసిన ఈయన.. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 24వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమాపై అంచనాలు పెంచడానికి ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించలేకపోయారు. దీంతో నిధి అగర్వాల్, నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam)మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో తన సినిమా అనాధగా అనిపించిందని, తన సినిమా అనాధ కాదని, నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాపై అంచనాలు పెంచారు.
ట్రెండింగ్ లోకి “#Boycott Harihara Veeramallu “
ఇక దీనికి తోడు నిన్న సాయంత్రం హైదరాబాదు శిల్పకళా వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు “#Boycott Harihara Veeramallu ” (బాయ్కాట్ హరిహర వీరమల్లు) అంటూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ సినిమా.
రాజకీయ చిచ్చులేపిన పవన్ కళ్యాణ్ స్పీచ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ప్రధానితో పరిచయాలు ఉంటే డబ్బు రాదు. భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర 10 నుండి 15 రూపాయలు పెట్టినా నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం మన ప్రభుత్వం అధికారంలో ఉంది. మన సత్తా ఏంటో చూపిద్దాం. నా దగ్గర గూండాలు, ఆయుధాలు లేరు. నా గుండెల్లో మీరే ఉన్నారు” అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ స్పీచ్ తో రెచ్చిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించారు – RRR
దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(RRR ) కూడా ఈ వేదికపై మాట్లాడుతూ.. “సినిమా విడుదలకు ముందే ఆంధ్ర ప్రదేశ్ లో ఔరంగాజేబు లాంటి వ్యక్తిని ఓడించడంలో పవన్ కళ్యాణ్ ప్రధమ పాత్ర పోషించారు. రియల్ లైఫ్ లో సత్తా చాటి ఇప్పుడు తెరపై హరిహర వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారు” అంటూ ఇలా పదేపదే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని టార్గెట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాటలు మాట్లాడారు.
సిగ్గున్న ఏ ఒక్కడు ఈ సినిమా చూడడు – వైసీపీ అభిమానులు
ఇక దీంతో ఈ విషయం రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అంతేకాదు సినిమా వాళ్లు ఇంక మారరా..? సిగ్గు వున్న వైసీపీ అభిమాని ఏ ఒక్కడు కూడా ఈ సినిమా చూడడు.. అంటూ బాయ్ కాట్ హరిహర వీరమల్లు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే విడుదలకు రెండు రోజుల ముందు ఇప్పుడు సినిమా బాయికాట్ అంటూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
also read:Avatar: Fire and Yash: అవతార్3 ఫస్ట్ లుక్, ట్రైలర్ పై బిగ్ అప్డేట్.. వరంగ్ ను కలవడానికి సిద్ధం కండి!
సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f
— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025