Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మకు ఫోన్ చేసిన రాథోడ్ నీకో గుడ్ న్యూస్ మా సారు మనోహరి మేడం గారిని ఎంక్వైరీకి పిలిచారు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ ఆయన మనోహరిని ఎక్వైరీకి పిలిచాడా..? కానీ ఎందుకు..? ఏం జరిగిందని అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో తెలియదు మిస్సమ్మ నేను ఆఫీసుకు రాగానే చాలా సీరియస్‌గా ఉన్నారు. మనోహరి మేడం బయట ఉన్నారా..? అని అడిగారు. ఉన్నారని చెప్పగానే లోపలికి తీసుకురమ్మని చెప్పారు. మిస్సమ్మ మా సారు మనోహరి మేడం గారికి టీ ఆఫర్ చేశారు.. అని రాథోడ్ చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా పిలిచి టీ ఇస్తే ఎంక్వైరీ చేసినట్టా అంటుంది.
అయ్యో మిస్సమ్మ మా సారు టీ ఇచ్చారు అంటే తాట తీయబోతున్నారని అర్థం అది మా సారు స్టైల్. నువ్వు ఎప్పుడు మా సార్ ఎంక్వైరీ చూడలేదు కాబట్టి నీకు అర్తం కావడం లేదు అని చెప్పగానే.. అవునా.. ఆయనకు కూడా మనలాగే అనుమానం వచ్చిందా..? అని మిస్సమ్మ అడుగుతుంది. చూస్తుంటే అలాగే ఉంది మిస్సమ్మ ఆధారాల కోసం ఆగినట్టు ఉన్నారు. అందుకే అన్ని సమకూర్చుని ఇప్పుడు పలిచినట్టు ఉన్నారు అని రాథోడ్ చెప్పగానే.. మిస్సమ్మ హ్యాపీగా ఎంత మంచి న్యూస్ చెప్పావు రాథోడ్.. ఎంక్వైరీ అయ్యేలోపు సంకెళ్లతో మను బయటకి వచ్చిందన్న న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను అంటుంది. సరే మిస్సమ్మ ఏం జరిగిందో నీకు ఫోన్ చేసి చెప్తాను ఉంటాను మరి అంటూ కాల్ కట్ చేస్తాడు రాథోడ్. మిస్సమ్మ సంతోషంగా గార్డెన్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కా అంటూ ఆరును పిలుస్తుంది.
మిస్సమ్మ సంతోషాన్ని చూసిన గుప్త బాలిక నీ సోదరి వచ్చిన వేగం చూస్తుంటే.. ఆ అనాథ పిల్లలకు ఇవ్వాల్సిన ధనం సమకూరినట్టు ఉంది అని చెప్తాడు. ఏంటి అప్పుడేనా..? అంటూ ఆరు హ్యాపీగా భాగీ ఇక్కడ అని పిలుస్తుంది. మిస్సమ్మ పరుగెత్తుకుంటూ ఆరు దగ్గరకు వస్తుంది. అక్కా నీకో గుడ్ న్యూస్ అంటుంది. ఆరు ఆత్రుతగా చెప్పు ఏంటా గుడ్ న్యూస్.. ఆ యాభై లక్షలు సమకూరాయా..? అని అడుగుతుంది. లేదక్కా నేను చెప్పాలనుకున్న గుడ్‌న్యూస్ అది కాదు. మా ఆయన మనును ఎంక్వైరీ చేస్తున్నారట అని చెప్పగానే ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. మనును ఎంక్వైరీ చేస్తున్నారా..? ఏ విషయం గురించి అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ తెలియదు అక్కా… ఇందాక రాథోడ్ ఫోన్ చేసి ఆయన సీరియస్‌గా మనును పిలిపించి ఏవేవో క్వశ్చన్స్ వేస్తున్నారట.. నాకు తెలిసి పెద్ద సీరియస్ మ్యాటరే అక్కా నాకెందుకో మను బ్యాడ్ టైం.. మన గుడ్ టైం స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది అక్క అంటూ ఇద్దరూ హ్యపీగా ఫీలువతుంటారు.
ఆరు సంతోషంగా గుప్త గారు మను మా ఆయనకు దొరికేసిందట అంటూ డాన్స్ చేస్తుంది. మిస్సమ్మ వింతగా చూస్తుంది. గుప్త గారు ఎవరు..? ఆయనకు మీరేం చెప్పారు..? అసలు నాకు కనిపించని వ్యక్తి మీకెలా కనిపిస్తున్నారు..? అసలు ఏం జరగుతుంది అక్కా ఇక్కడ..? చెప్పండి అక్కా ఏం జరుగుతుంది. అంటూ గట్టిగా అరుస్తుంది మిస్సమ్మ. దీంతో ఆరు చెప్పాను కదా భాగీ మా తాతను అప్పుడప్పుడు ఊహించుకుంటానని.. ఇప్పుడు నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు కదా అందుకే ఆయనకు చెప్పేసుకున్నాను అంటుంది ఆరు. దీంతో మిస్సమ్మ అందుకు చనిపోయిన వ్యక్తిని ఊహించుకున్నారా..? అని అడుగుతుంది.
దీంతో నిజమే భాగీ నువ్వు సూపర్ ఇంటిలిజెంట్.. ఇంతకీ ఎందుకు మనును ఎంక్వైరీ చేస్తున్నారు.. చెప్పు అని ఆరు అడగ్గానే.. తెలియదు అక్కా ఎంక్వైరీ అయిపోగానే రాథోడ్‌ను ఫోన్ చేయమన్నాను. అవును అక్కా నిన్ను చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను.. మీరెప్పుడు మా లాన్ లో ఉంటున్నారు.. మీ ఇంట్లో కన్న ఎక్కువ ఇక్కడే ఉంటున్నారేమో అనిపిస్తుంది అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో మా ఇంట్లో ఇలాంటి లాన్ లేదు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అందుకే మా ఇంట్లో పని అయిపోగానే ఇక్కడకు వస్తుంటాను. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతాను అంటుంది. ఏమీ వద్దని నీ ఇష్టం ఉన్నంతసేపు ఇక్కడ ఉండొచ్చని చెప్తుంది.
మరోవైపు తన ఎదురుగా కూర్చున్న మనోహరిని చూసిన అమర్ నేను మాట్లాడాలి అనగానే ఎందుకు అంత టెన్షన్ మనోహరి అని అడుగుతాడు. టెన్షన్ నాకు ఏం లేదు అమర్ అంటుంది మనోహరి. మరి అంత చెమట ఎందుకు పడుతుంది.. అని అడగ్గానే.. ఫ్యాన్ అమర్ ఫ్యాన్ స్పీడుగా తిరగడం లేదు.. అనగానే.. నా రూంలో ఫ్యాన్ లేదు మనోహరి.. ఏసీ ఉంది. అది కూడా ఇరవై రెండులో ఉంది.
ఇంత టెంపరేచర్ లో కూడా చెమట వస్తుందంటే టెన్షన్ పడుతున్నావు. ఏం మనోహరి నన్ను టెన్షన్ పడాల్సిన అవసరం ఏమైనా ఉందా..? అని అమర్ అడగ్గానే లేదని మనోహరి చెప్తుంది. ఇంతలో అమర్ గన్ తీసి టేబుల్ మీద పెడతాడు. మనోహరి భయపడుతుంది. నువ్వు కోల్‌కతా ఎందుకు వెళ్లావు మనోహరి. మరి రెండేళ్లు ఎక్కడ ఉన్నావు..? ఏం పని చేశావు.. ఎవ్వరినైనా ఇష్టపడ్డావా..? పెళ్లి చేసుకున్నావా..? అని అమర్ అడగ్గానే..మనోహరి భయంతో రణవీర్‌తో పెళ్లి అయిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?