CBSE: పాఠశాలల్లో భద్రత, విద్యార్థుల క్షేమం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. స్కూళ్లలో అన్ని ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ పాయింట్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో వద్ద ఆడియో విజువల్ సౌకర్యం కలిగిన హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని తెలిపింది. పాఠశాల లాబీలు, మెట్ల వద్ద, క్లాస్ రూం, ల్యాబ్ లు, లైబ్రరీ, క్యాంటీన్ ఏరియా, స్టోర్ రూం, క్రీడా స్థలం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
⦿ పిల్లల భద్రత కోసమే..
రియల్ టైం ఆడియో – విజువల్ రికార్డింగ్ తో కనీసం 15 రోజులల ఫుటేజీను స్టోర్ చేయగల కెపాసిటీ ఉండాలి. అలాగే విద్యాధికారులు 15 రోజుల బ్యాకప్ ను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని సీబీఎస్ఈ తమ ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది. విద్యార్థుల భద్రత కోసం తాము జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని చెప్పింది. ఇంటి నుంచి స్కూలుకు వచ్చే స్టూడెంట్స్ మళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు మంచి సురక్షితమై వాతావరణం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వివరించింది.
⦿ ఆడియో- విజువల్ ఫెసిలిటీ తప్పనిసరి..
కొత్త రూల్స్ ప్రకారం.. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో హై- రెజల్యూషన్ కెమెరాలను తప్పకుండా అమర్చాలి. ఈ కెమెరాల్లో ఆడియో- విజువల్ ఫెసిలిటీ కూడా ఉండాలని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.
⦿ సీసీ కెమెరాలు ఎక్కడ ఉండాంటే..?
➼ స్కూల్ ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద…
➼ స్టోర్ రూం..
➼ క్రీడా స్థలం
➼ క్యాంటీన్ ఏరియా..
➼ మెట్ల వద్ద..
➼ తరగతి గదులు
➼ ల్రైబ్రరీ..
➼ ల్యాబ్స్..
⦿ నోట్: టాయిలెట్స్ అడ్ వాష్ రూంస్ తప్ప స్కూల్ లోని అన్ని మిగిలిన అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించడం ద్వారా.. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.
ALSO READ: Mega Job Fair: హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. ఈ అర్హతలున్న వారు హాజరవ్వండి..
ALSO READ: Railway Jobs: రైల్వేలో 6వేలకు పైగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ నీదే బ్రో..