Kingdom: గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం నాగవంశీ నిర్మించిన ఏ సినిమా ఈవెంట్ కు హాజరైన కూడా ఈ సినిమా గురించి నాకు వంశీ ఇచ్చిన ఎలివేషన్. ఈ సినిమాలో ఎన్ని తప్పులు అయినా వెతకండి ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ వచ్చారు.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా రెండు పార్ట్ లుగా రానుంది. ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ప్లస్ అవ్వనుంది. ఇప్పటికే కింగ్డమ్ నుంచి విడుదలైన రెండు పాటల కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జులై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
కింగ్డమ్ కోసం ఆ దర్శకుడు
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగ వంశీ మంచి సినిమాలను నిర్మించడమే కాకుండా దానిని ప్రేక్షకుల వద్దకు ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచనలో కూడా ఉంటారు. అయితే ఈ సినిమా కోసం ఏకంగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగను లైన్ లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగతో విజయ్ దేవరకొండ, గౌతమ్ కలిసి ఒక ఇంటర్వ్యూ చేయనున్నారు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ మధ్య ఎంత మంచి పరిచయం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజుకి విజయ్ దేవరకొండ కు వరుస డిజాస్టర్ సినిమాలు పడినా కూడా నిలబడ్డారు అంటే దానికి ఏకైక కారణం అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్. వీరిద్దరూ మరోసారి ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ కి కనిపించనున్నారు.
మరోసారి విజయ్ తో
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తీస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ సినిమా మంచి సంచలనాలకు తెరతీసింది. అద్భుతమైన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. ఆ సినిమాతో బాలీవుడ్ లో తెలుగు వాడి సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు సందీప్. అయితే సందీప్ చాలా సార్లు మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో ఖచ్చితంగా నేను కలిసి పని చేస్తాను మళ్ళీ సినిమా చేస్తాను అంటే చెప్పుకొచ్చారు. బహుశా ఈ ఇంటర్వ్యూలో దాని గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Mass Jathara Update: మాస్ జాతర ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తవుతుందంటే ?