BigTV English

Rajinikanth : రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..

Rajinikanth : రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..

Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక ఆయన సినిమాల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు రాయడానికి రాతలు సరిపోవు. నిజానికి ఈయన తమిళ నటుడు అయినా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులు మనసులో స్టార్ హీరో అనే గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలతో మాత్రమే కాదు అయినా మంచి మనసు చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ‘తలైవా’ రజినీ గురించి అక్కినేని నాగార్జున ఒక హృద్యమైన విషయాన్ని వెల్లడించారు.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.. ఈ మూవీ షూటింగ్ టైం లో రజినీ చేసిన మంచి పని గురించి నాగ్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వీడియో తలైవా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


350 మందికి రజినీ సాయం…

రజినీకాంత్ దగ్గరకు సాయం కోసం వెళ్లిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు. అంతేకాదు తనతో పాటు సినిమా చేస్తున్న టీమ్ కు కమ్మటి భోజనం పెట్టిస్తారు. అంతేకాదు స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన గొప్ప మనసు చాటుకున్నాడు. థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రి వేళల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. దాదాపు 350 మందితో కూడిన బృందం ఎంతో శ్రమించింది.. కూలీ మూవీ చివరి రోజు, రజినీ గారు అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్లినప్పుడు పిల్లల కోసం ఏదైనా కొనండి అంటూ ప్రేమగా చెప్పారు. అలాంటి మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారు, అని నాగార్జున భావోద్వేగంతో చెప్పారు..


Also Read: శ్వేత మీనన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

‘కూలీ’ మూవీ విషయానికొస్తే…

రజినీకాంత్ కెరీర్‌లో ఇది 171వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కూలీ.. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కూలీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాకుండా ఒక స్టాండ్ అలోన్ సినిమా అని డైరెక్టర్ లోకేష్ కనకరాజు స్వయంగా చెప్పడంతో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. తమిళ చిత్రానికి సంబంధించి అత్యధిక ఓవర్సీస్ రేటుకు అమ్ముడై, ఈ సినిమా ఇప్పటికే ఓ రికార్డు కూడా సృష్టించింది. ఈ చిత్రంలో రజినీ, నాగార్జునతో పాటు ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజినీ-సత్యరాజ్ లు సుమారు 38 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో నటిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో కి రిలీజ్ కాబోతుంది.. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Big Stories

×