BigTV English

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Sunil Ahuja: దేశంలో ఐటీ దాడులతో రకరకాల ఏజెంట్లు భయం పడుతున్నారా? తప్పించుకునేందుకు కొందరు దేశం వదిలి పారిపోయారా? మరికొందరు మకాం మార్చేశారా? వారిలో హవాలా మనీ ఏజెంట్లు ఉన్నారా? అవుననే అంటున్నారు అధికారులు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రేపో మాపో కొందరు అరెస్టు కావచ్చని ఓ అంచనా.


కోట్లాది రూపాయల సైబర్​ ఫ్రాడ్​ కేసులపై ఈడీ దృష్టి పెట్టింది. కోట్లాది రూపాయలను దేశం దాటించినట్టు గుర్తించిందట. ఈ క్రమంలో బుధవారం దేశంలోని ఢిల్లీ, నొయిడా, గురుగావ్​, డెహ్రాడూన్ సహా మొత్తం 11 చోట్ల దాడులు చేసింది. వీటికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్​ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల విదేశాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతోంది ఓ సైబర్ క్రిమినల్ గ్యాంగ్. తాము పోలీసు అధికారులంటూ ఎంఎన్‌సీ కంపెనీలై మైక్రోసాఫ్ట్, ఆమెజాన్ సంస్థల టెక్నికల్​ ఏజెంట్లమని చెప్పి వందలాది మందిని నమ్మించారు. వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ విధంగా లూటీ చేసిన నిధులను బిట్ కాయిన్స్​‌గా మార్చినట్టు గుర్తించారని తెలుస్తోంది.


నిధులను అమెరికన్ డాలర్లుగా మార్చి హవాలా ద్వారా దుబాయి వంటి దేశాలకు చేర్చినట్టు ఆధారాలు లభించాయి. ఏకంగా 260 కోట్ల రూపాయల ఆస్తులు విదేశాలకు వెళ్లినట్టు గుర్తించింది సీబీఐ. వాటిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ భారత్‌తోపాటు కొన్నిదేశాల్లో ఇలాంటి మోసాలు పాల్పడినట్టు తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్​ జారీ చేశారు.

ALSO READ: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు

నగదు తరలింపులో భారీగా మనీ లాండరింగ్​ కు పాల్పడినట్టు గుర్తించారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు కోసం వేట మొదలైంది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉందన్నది ఈడీ వర్గాల మాట. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయన్నారు. ఈ విషయం తెలియగానే సునీల్‌కుమార్ అహూజా వంటి వారు దేశం విడిచినట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.

ఏపీ లిక్కర్ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ద్వారా సేకరించిన ముడుపులను సునీల్ అహుజా ద్వారా దుబాయ్, అమెరికాలకు హవాలా ద్వారా పంపినట్టు సిట్ అధికారులు గుర్తించారట. దీనికి సంబంధించి వారి ఆచూకీ కోసం సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఈడీ కూడా హవాలా గ్యాంగ్‌పై కన్నేయడంతో పట్టుబడతామని భావించిన సునీల్ సైలెంట్‌గా దేశం విడిచినట్టు అధికారుల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×