E-Paper
Advertisement

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ
Advertisement

Murder Mystery Series on OTT: కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ఫ్రాంచైజీ అంటే యూత్‌లో ఉండే క్రేజ్ వేరు. ఇప్పటివరకు కాలేజ్ రొమాన్స్, స్నేహం, డ్యాన్స్‌లు, పోటీలతో సాగిన ఈ ఫ్రాంచైజీని ఈసారి మేకర్స్ పూర్తిగా కొత్త దారిలోకి తీసుకెళ్లారు. అందమైన క్యాంపస్‌ను నేపథ్యంగా చేసుకుని ఒక డార్క్ మర్డర్ మిస్టరీని సిద్ధం చేశారు. అదే ‘Student of the Year: After Dark’. షనాయా కపూర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ హిందీ వెబ్‌సిరీస్ నవంబర్ 13 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ విద్యార్థుల మధ్య జరిగే పోటీ కేవలం పేరు, గుర్తింపు కోసం మాత్రమే కాదు.. దాని వెనుక ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. మరి ఈ సిరీస్ తెలుగులో ఉందా ? కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రతిష్టాత్మకమైన సెయింట్ థెరిసా హెరిటేజ్ స్కూల్‌లో అయేషా మాలిక్ (షనాయా కపూర్) అందరికీ తెలిసిన పాపులర్ స్టూడెంట్. మాజీ చైల్డ్ స్టార్ అయిన ఆమె ఒకరోజు అక్కడి బరాఖలి సరస్సులో శవమై కనిపిస్తుంది. గడ్డకట్టిన నీటిలో మునిగి చనిపోయిన ఆమె మరణం పైకి ప్రమాదంలా కనిపించినా, దూరంగా పెరిగిన కవల సోదరి అదితి (షనాయా కపూర్) మాత్రం దాన్ని నమ్మదు. తన అక్క మరణం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించి, అసలు నిజాన్ని బయటపెట్టేందుకు అదే స్కూల్‌లో చేరుతుంది.

Advertisement

అక్కడికి వెళ్లాక అదితికి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో జరిగే ఒక రహస్య పోటీ గురించి తెలుస్తుంది. ఈ పోటీలో విజేతగా నిలిస్తే తమ కలలు నిజం చేసుకునే అవకాశం దక్కుతుందని విద్యార్థులు నమ్ముతుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్‌కైనా సిద్ధపడతారు. అయేషా మరణానికి ఈ పోటీకి సంబంధం ఉందని గ్రహించిన అదితి కూడా అందులో పాల్గొంటుంది. ఒకవైపు పోటీలో ముందుకు సాగుతూనే, మరోవైపు తన అక్కకు దగ్గరగా ఉన్న స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ను ప్రశ్నిస్తూ ఆధారాలు సేకరిస్తుంది.

ఈ క్రమంలో అయేషా స్నేహితుల మధ్య ఉన్న ఈర్ష్యలు, పాత గొడవలు, దాచిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రతి ఒక్కరిపైనా అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. అసలు అయేషా మరణానికి కారణం ఎవరు? అదితి తన అక్కకు న్యాయం చేయగలిగిందా? అనే ఉత్కంఠ చివరి ఎపిసోడ్ వరకు కొనసాగుతుంది.

తెలుగులో చూడవచ్చు

Advertisement

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ (Student of the Year: After Dark) సిరీస్‌లో షనాయా కపూర్ అయేషా మాలిక్, అదితి అనే కవల సోదరీమణులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఆమెతో పాటు దివిక్ శర్మ, అభినవ్ సింగ్, మాన్యా గ్రోవర్, దియా దమానీ, ఆది మాలిక్ తదితర యువ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. రీమా మాయా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అదార్ పూనావాలా నేతృత్వంలోని ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒరిజినల్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో JioHotstar వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

రణబాలిగా ఓటీటీలో విజయ్ దేవరకొండ ఊచకోత షురూ… ఈ రేంజ్ వైలెన్స్ ఎప్పుడైనా చూశారా?

ఓటీటీలోకి ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ కల్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×