Sunil Gavaskar reaction on Rishabh Pant wicket: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd Test) మధ్య క్రైస్ట్‌చర్చ్ లోని హ్యాగ్లీ ఓవల్ (Hagley Oval, Christchurch) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో గిల్ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు న్యూజిలాండ్ జట్టును అలౌడ్ చేసి.. ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 100 పరుగులు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ మొత్తం పేక మెడలాకూలగా ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)… జాకబ్ డఫ్పీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. చెత్త షాట్ ఆడి రిషబ్ పంత్ ఔట్ అయినందుకు కామెంట్రీ బాక్సులో కూర్చున్న సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) తల బద్దలు కొట్టుకున్నాడు. ఇదెక్కడి ఆటరా నాయన అంటూ సీరియస్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మొదటి టెస్ట్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా బ్యాటర్లు.. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం తేలిపోయారు. న్యూజిలాండ్ ఫేసర్ల దాటికి క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా… కేఎల్ రాహుల్ 25 పరుగులు, దేవదత్ పడిక్కల్ 21 పరుగులకు వికెట్ సమర్పించుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కెప్టెన్ శుభమాన్ గిల్ 17 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన రిషబ్ పంత్ 23 పరుగులు చేసి అనవసరపు షాట్ కోసం వెళ్లి ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా కామెంట్రీ బాక్స్ లో కూర్చున్న సునీల్ గవాస్కర్ అసహ్యం వ్యక్తం చేశాడు. బాగా ఆడాల్సిన వాడు ఇలా ఔట్ అయ్యాడు ఏంటని గిల గిల కొట్టేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ 116.3 ఓవర్లు ఆడి 356 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ 89 పరుగులు చేయగా టామ్ లాథమ్ 59 పరుగులతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆకాశ్ దీప్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో రెండు వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు. 26 ఓవర్లు వేసినప్పటికీ బుమ్రా వికెట్ మాత్రం తీయలేదు.
Sunil Gavaskar's reaction on Rishabh Pant wicket 😭 pic.twitter.com/MSYaBdQ0XY
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) November 28, 2026