E-Paper
Advertisement

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?
Advertisement

Chapri Teaser: బండి సరోజ్ కుమార్..ఎప్పుడూ సరికొత్త కథలతో ఆడియన్స్ ని అలరించే ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా ‘ఛప్రి’అనే మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అయిపోయాడు.అయితే ఇప్పటివరకు సరోజ్ చేసిన సినిమాలకు భిన్నంగా, ఇది మరింత బోల్డ్ గా ఉండటం విశేషం.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ అందరిని ఆకర్షించగా ఇపుడు తాజాగా విడుదలైన అఫీషియల్ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పాలి.

తనకంటూ మంచి ఫ్యాన్ బేస్

Advertisement

గతంలో ‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి సినిమాలతో తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న సరోజ్ కుమార్, ఈసారి కూడా ఒక పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది.

టీజర్ చూస్తే అందమైన సింహం మగసింహం, అందమైన నెమలి మగనెమలి, అందమైన కోడి మగకోడి అంటూ సాగే డైలాగ్స్‌ సినిమాపై బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు అందమైన మనిషి ఎవరు అనే ప్రశ్నతో పాటు మగాడి గొప్పతనం, ఆత్మగౌరవం గురించి హీరో చెప్పే డైలాగ్స్ కి థియేటర్ లో విజిల్స్ పడటం పక్కా.

Advertisement

ముఖ్యంగా ‘అమ్ముడుపోయిన మొగోడు ఆడదానితోటి సమానం’ అంటూ సరోజ్ చెప్పిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్.ఇక ఈ సినిమాలో డబ్బు, ప్రేమ, ఆడమగ సంబంధాల మధ్య ఉండే రిలేషన్స్ పై సరోజ్ గట్టిగానే ఫోకస్ చేశాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

డబ్బు ఉంటే దేనినైనా కొనవచ్చు

ఇక టీజర్‌లో డబ్బు ఉంటే దేనినైనా కొనవచ్చు అనే ఈ ప్రపంచానికి మనిషి ఆత్మగౌరవాన్ని కొనలేమనే మెసేజ్ ని చాలా సాలిడ్ గా ఇచ్చాడు సరోజ్.ఇక టీజర్ చివర్లో వచ్చే డైలాగులు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయనే చెప్పాలి. రాజు, రెడ్డి, నాయుడు, దొర, యాదవ్, గౌడ్ అంటూ రకరకాల కులాల పేర్లను చెబుతూ ఛప్రి కూడా తనకొక గుర్తింపు అని హీరో చెప్పడం చూస్తే సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసేలానే కనిపిస్తుంది.

‘ఛప్రి నా కులం.. నర్సింగ్ ఛప్రి నా దేవుడు’ అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ చేసిన సరోజ్ కుమార్ ఈ సారి ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎత్తుకున్న తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్, అక్కడి బాష ,యాస, లోకల్ నేటివిటీ ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

ALSO READ :సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో

ప్రస్తుతం టాలీవుడ్ లో రొటీన్ సినిమాల కన్నా సరికొత్త సినిమాలానే ఆడియన్స్ ఆదరిస్తున్నారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కంటెంట్ బలంగా ఉంటే చాలు చిన్న సినిమాలు అయినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.ఇక ప్రస్తుతం సరోజ్ వదిలిన చప్రీ కూడా ఆ కోవలోనే కనిపిస్తుంది.చూడాలి మరి టీజర్ తోనే ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన సరోజ్ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags

Related News

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

Big Stories

Advertisement
×