Nayanthara Documentary Controversy: స్టార్ హీరోయిన్ నయతనార మరో వివాదంలో నిలిచింది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితం ఆధారంగా ఇటీవల డాక్యుమెంటరీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది విడుదల తర్వాత కోలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తన పర్సనల్ లైఫ్ గురించి నయన్ ప్రస్తావించారు. తను సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరు.. తనకు ఎదురైన అనుభవాలు, లవ్, బ్రేక్.. విఘ్నేశ్ శివన్ పరిచయం.. నుంచి పెళ్లి వరకు ప్రతి విషయాన్ని ఆవిష్కరించారు.అయితే ఇందులో నానుమ్ రౌడీ దాన్ మూవీ క్లీప్ వాడటంపై ధనుష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై నయన్ దంపతులకు పరువునష్టం దావా వేశాడు.
ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ కోర్టులో ఉంది. అదే సమయంలో చంద్రముఖి మూవీ టీం కూడా నయన్ డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోది. ఈ వ్యవహారంపై చంద్రముఖి మూవీ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. డాక్యుమెంటరీలో మూవీకి సంబంధించిన ఫుటేజీని అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ నయనతార, నెట్‌ఫ్లిక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. అంతేకాదు కాపీ రైట్ కింద రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించి డాక్యుమెంటరీ నిర్మాతలు టార్క్ స్టూడియో ఎల్‌ఎల్‌పీకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసి.. వచ్చేనెల అక్టోబర్ 6వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చంద్రముఖి మూవీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము నయనతారకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తాము రూ. 5 కోట్లు డిమాండ్ చేశామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసింది.
Also Read: Kishkindhapuri First Review: కిష్కంధపురి ఫస్ట్ రివ్యూ… హర్రర్ ప్లస్ థ్రిల్లర్
కాగా నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్ రౌడీ దాన్ మూవీ క్లిప్ వాడటం వివాదానికి దారి తీసింది. తమ అనుమతి లేకుండ మూవీ క్లిప్ వాడటంపై ధనుష్ తీవ్ర అభ్యంతరం తెలిపాడు. ఈ విషయమైన నయన్ దంపతులపై పరువు నష్టం దావా వేశాడు. కాపీ రైట్ కేసు కింద రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడు. దీనిపై నయనతార, విఘ్నేశ్ శివన్‌ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ వ్యవహరంలో కోర్టులో ఉంది. ధనుష్ కేసులో నయన్ దంపతులు నోటీసులు కూడా వెళ్లాయి. కానీ, దీనిపై వారు స్పందించకపోవడం గమనార్హం.
కాగా నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. విజయ్ సేతుపతి, నయనతారలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్ వాడారు. ఇదే మూవీ సెట్ లో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను ఉన్న ఈ మూవీ క్లిప్ ని వాడమని, ఇందుకు ధనుష్ పర్మిషన్ కోసం ప్రయత్నించామని నయనతార ఓపోస్ట్ వెల్లడించింది. కానీ, ఈ విషయంపై ధనుష్ కనీసం మాట్లాడేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలేదని చెప్పింది. దీనిక ధనుష్ ఎన్నోసార్లు ఫోన్ చేసిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పింది. ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు మూవీ షూటింగ్ టైంలో తమ ఫోన్ చిత్రీకరించిన క్లిప్స్ వాడమని వివరణ ఇచ్చింది.