BigTV English

Chinmayi Sripada: రణబీర్ పై భారీ ట్రోల్స్.. రేపిస్టులు రాజ్యమేలుతున్నారు అంటూ నెటిజన్ కి భారీ కౌంటర్!

Chinmayi Sripada: రణబీర్ పై భారీ ట్రోల్స్.. రేపిస్టులు రాజ్యమేలుతున్నారు అంటూ నెటిజన్ కి భారీ కౌంటర్!

Chinmayi Sripada:ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అన్యాయాలను అడ్డుకట్ట వేయడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలపై సదరు నెటిజన్స్ చేసే కామెంట్లకు కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హిందీ రామాయణం సినిమాకు సంబంధించి నిన్న ఒక అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమా ఉంటుంది అని తెలియజేస్తూ.. ఫస్ట్ గ్లింప్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, యష్ (Yash) రావణాసురుడిగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ గ్లింపు విడుదల చేయగానే.. ఇందులో విజువల్స్, బీజీఎం, రణబీర్ కపూర్ ను ప్రెసెంట్ చేసిన తీరు అన్నీ కూడా సూపర్ అని చెప్పాలి.


బీఫ్ తినేవాడికా రాముడి పాత్ర – నెటిజన్స్

అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నెగిటివిటీని వెతికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఒక నెటిజన్ ” బీఫ్ తినేవాడు రాముడు పాత్రను పోషించడం మన కర్మ”అంటూ కామెంట్ చేయడంతో ఈ విషయం నిన్న సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. రామచంద్ర ప్రభో.. హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను అత్యంత పవిత్రంగా భావించే మనం.. ఇప్పుడు ఆ ఆవు మాంసాన్నే తినేవాడు రాముడు పాత్ర పోషించడం ఏంటయ్యా ? అంటూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు. దీంతో చిన్మయి కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది.


రేపిస్టులు రాజ్యమేలవచ్చా – చిన్మయి

దీనిపై చిన్మయి మాట్లాడుతూ.. కిదేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయొచ్చు.. మళ్లీ బయటకు రావచ్చు.. ఎన్నికలలో ఓట్లు కూడా సంపాదించి ఇప్పుడు రాజ్యమేలవచ్చు. ఇదే మా భక్త్ ఇండియా.. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు కదా..” అంటూ చిన్మయి కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు.

ట్విట్టర్లో చిన్నపాటి యుద్ధం..

అంతలోనే ఒక నెటిజన్..” ఒక చెడ్డ పని.. మరో చెడ్డ పనితో ఎలా జస్టిఫై చేస్తున్నారు?”అని అడగ్గా..” బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రను పోషిస్తే మీకు ప్రాబ్లం వస్తోంది.. రేపిస్టులు రాజ్యాన్ని ఏలుతుంటే మీకు ప్రాబ్లం లేదా?” అని మళ్లీ రివర్స్లో ప్రశ్నించింది. దీంతో సదరు నెటిజన్..” మీరు మీ ఫెమినిజం, ఫెమినిస్ట్ వరకు ఉండండి. ఈ మేటర్ లోకి దూరకండి” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

చిన్మయికి అండగా నెటిజన్స్..

అంతటితో ఆగకుండా మళ్లీ ఆ ట్వీట్ కి కూడా చిన్మయి సమాధానం ఇచ్చింది. దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలని చూసేవారు.. ఏం లేకుండా నాశనం అయిపోతారు.. అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా.. మీ ఇష్టం చూస్తారుగా అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఇక మొత్తానికి అయితే రణబీర్ కపూర్ కు అండగా నిలుస్తూ చిన్మయి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలకు దారితీస్తున్నాయి. ఇక మరి కొంతమంది ఏమో చిన్నయికి అండగా నిలుస్తున్నారు. రేపిస్టులే రాజ్యమేలుతుంటే మాంసం తిన్నాడని ఆ పాత్ర చేయకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

also read:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత!

Related News

Kanyakumari trailer : డేటింగ్ లు లేవు అంతా బ్యాటింగ్ లే, కన్యాకుమారి ట్రైలర్

Ram Charan Peddi: వెనక్కు తగ్గిన రామ్ చరణ్, నానికి ఇదే ప్లస్ పాయింట్

Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్

Aamir Khan: సిగరెట్ వెలిగిస్తే తప్పేంటి? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు.!

Dasari Kiran: పోలీసుల అదుపులో రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్!

Rahul Sipligunj: కన్యాకుమారిలో రాహుల్ సిప్లిగంజ్.. నిన్న నిశ్చితార్థం.. నేడు పూజలు

Big Stories

×