Intinti Ramayanam Today Episode july 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. పాల ప్యాకెట్ కోసం అవని, అక్షయ్ షాప్ వద్దకు వెళ్తారు.. ఇక్కడ ఒకే పాల ప్యాకెట్ ఉండడంతో షాప్ అతను ఇద్దర్నీ స్టేరో సగం పంచుకోమని చెప్తాడు. నాకు కాఫీ తాగపోతే ఏమి తోచదు. అయితే నాకు కాఫీ పెట్టివ్వండి అని అవని పాల ప్యాకెట్ ని అక్షయ్ కు ఇస్తుంది. అయితే అవని అక్షయ్ ఇంటికి వెళుతుంది.. అక్షయ్ అవనీని భరించలేను అని అవని అంటుంది. కాఫీ పెట్టడానికి కూర్చో తీసుకొని వస్తానని లోపలికి వెళ్తాడు.. అవని కూడా అక్షయ్ తో పాటు లోపలికి వెళ్తుంది. పాలు పొంగడంతో అక్షయ్ చెయ్యి కాలుతుంది.. అక్షయ్ చెయ్యి కాల్చుకోవడంతో అవని నేను పులిని అది ఇది అన్నారు కాఫీ కూడా పెట్టలేరా అని అంటుంది.. అక్షయ్ మళ్ళీ అవని ప్రేమలో పడిపోతాడు.. ఇలాంటివన్నీ చూస్తుంటే ఏవేవో గుర్తొస్తున్నాయి అని అవని అంటుంది..
కానీ అక్షయ్ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.. ఇక అవని కూర్చొని ఉంటే అక్షయ్ కాఫీ తెచ్చి ఇస్తాడు. అదేంటి ఒక కప్పు నే తెచ్చారు మీరు తాగరా అని అవని అడుగుతుంది.. నేను తర్వాత తాగుతాను నువ్వు తాగు అని అక్షయ్ అంటాడు.. అక్షయ్, అవనీలు కలిసిపోయారని పార్వతీ టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి వీధిలో వాళ్ళ అన్న మాటల్ని విని బాధపడుతూ ఉంటుంది. చూశారా అత్తయ్య నేను ముగ్గురు కోడల్ని ఒకేలాగా చూశాను. కానీ వాళ్ళందరి నన్ను ఎలా మాట్లాడాలో చూసారా? ఈ మాటలు గనక అక్షయ వింటే తప్పుగా అనుకోడు అదే నిజమని నమ్ముతాడు కదా అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్షయ్. వచ్చి నేను అంత విన్నాను అమ్మ నువ్వు నాకు నమ్మకానివి కాదు నా ప్రాణం కూడా అని అక్షయ్ అంటాడు. ఇక అవని మాత్రం కమల్ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తారు.
వదిన నువ్వు చెప్పినట్లే చేసాము కచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మ వాళ్ళని తీసుకెళ్తారు. మొత్తానికి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది.. సరే వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి ఏ క్షణమైనా రావచ్చు. మేము ఇక్కడ నీతో మాట్లాడటం చూస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని అక్కడి నుంచి శ్రీకర్ కమల్ వెళ్ళిపోతారు. కాఫీ ఇచ్చిన ప్రణతి కాల నొప్పులు గురించి మాట్లాడుతూ నొక్కుతూ ఉంటుంది.
అప్పుడే శ్రియ పల్లవిలు అక్కడికి రావడం చూసి ఏంటి వీళ్లిద్దరు కలిసి వచ్చారు ఏమైనా జరిగిందేమో అని ప్రణతి అంటుంది.. ఇంట్లోకి రాగానే అత్తయ్య గారు మీ అబ్బాయిలు తాగచ్చి మమ్మల్ని కొడుతున్నారు అని చెబుతారు.. వాళ్లు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా మీరేం వాళ్ళని టార్చర్ చేస్తుంటారు కదా అని అక్షయ్ అంటారు. పల్లవి, శ్రీయా లు ఎంత చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు.
మేము ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదు ఏంటి? మేం చెప్పేది నిజం వాళ్ళ తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంతో ఇలా రెచ్చిపోతున్నారు. మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అత్తయ్య అని శ్రియ పల్లవిలు పార్వతిని వేడుకుంటారు.. పల్లవి శ్రీయాలు ఎంత చెప్తున్నా సరే పార్వతీ మాత్రం మేము చచ్చిన ఆ ఇంటికొచ్చే ప్రసక్తే లేదు అని అంటుంది.. ఈ పల్లవి మీ పెద్ద కొడుకు అక్షయ దగ్గరే ఉంటారా మీ పిల్లల్ని మీరు పట్టించుకోరా అని అడుగుతుంది.
మీకు మీ కొడుకులు మీద ప్రేమ లేకపోయినా సరే.. గోడలమైన మా మీద మీకు ప్రేమ లేదని బ్రతిమలాడుతారు.. అప్పుడే రాజేంద్రప్రసాద్ వచ్చి మీ అత్తయ్య రాదు.. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకోవడం కాదు.. ఇక్కడ ఉంటే అక్షయ్ ని తన భార్యని కలవనీయకుండా చేయొచ్చు అందుకే రాదు అని అంటాడు. దానికి పల్లవి వాళ్ళిద్దరి గురించి తప్ప మా గురించి మాకు ఆఫరాల గురించి మీరు పట్టించుకోరు అత్తయ్య అని నిలదీస్తుంది.
Also Read:శ్రీవల్లిని రామరాజు క్షమిస్తాడా? చందుకు పది లక్షల మ్యాటర్ లీక్..
నేను వెళ్ళను అని పార్వతి మొండికేసి కూర్చుంటుంది. అవని అంటారు ఏవండీ అత్తయ్యకి నేను చెప్పినా.. ఎవరు చెప్పినా వినరు మీరు చెప్తే వింటారు అని అంటుంది.. నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్ని తెలుసు అని అక్షయ్ తో అవని అంటుంది. ఏం తెలుసు మీకు. అంత తెలిసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అని అవని అంటుంది. అవని మాటలకు సీరియస్ అయినా అక్షయ్ పార్వతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.. పల్లవి శ్రియాలు రేపు మీరు వస్తున్నారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..