Film industry:సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాల ద్వారా వందల కోట్ల ఆస్తులు పోగేసిన ఈ నటులు ఇలా అనారోగ్యం కారణంగా మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. డబ్బే శాశ్వతం కాదని, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఎవరికివారు సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే చాలామంది సెలబ్రిటీలు ఫిట్ గా ఉండడానికి, అలాగే ఇంకా సంపాదించాలి అనే ఆలోచనలో ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. తద్వారా అతి చిన్న వయసులోనే స్వర్గస్తులవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరో వచ్చి చేరారు. 56 ఏళ్ల వయసులోనే ఆయన తుది శ్వాస విడవడం అటు సినీ ఇండస్ట్రీ కూడా తట్టుకోలేకపోతోంది.
క్యాన్సర్ తో ప్రముఖ హీరో కన్నుమూత..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్ మహన్(Julian McMahon) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలే కావడం గమనార్హం. క్యాన్సర్ తో కన్నుమూసినట్లు ఆయన భార్య కెల్లీచ మీడియాతో దృవీకరించారు. ఈయన ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ ఎంపీ విలియం కుమారుడు. 2003లో Nip/Tuck అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత మార్వెల్ మూవీస్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’ లో డాక్టర్ డూమ్ పాత్రలో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇటీవల ‘ ఎఫ్ బి ఐ : మోస్ట్ వాంటెడ్’ లో కీలకపాత్ర పోషించారు. ఇకపోతే ఈయన క్యాన్సర్ వ్యాధితో మరణించడం పై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణానికి అటు సినీ సెలెబ్రిటీలు, ఇటు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
జూలియన్ మెక్ మహన్ జీవిత విశేషాలు..
ఈయన అసలు పేరు జూలియన్ డానా విలియం మెక్ మహన్. ఈయన ఒక ఆస్ట్రేలియన్ – అమెరికన్ నటుడు. ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి సర్ విలియం మెక్ మోహన్ ఏకైక కుమారుడు కూడా. Nip/ Tuck మూవీలో తన నటనకు గాను టెలివిజన్ డ్రామా సిరీస్ లో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ కి కూడా నామినేట్ అయ్యారు. 1968 జూలై 27న ఆస్ట్రేలియా సిడ్నీలో జన్మించిన ఈయన.. 2025 జూలై 2న అమెరికా, ఫ్లోరిడా, క్లియర్ వాటర్ లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అయితే ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జూలియన్ వ్యక్తిగత జీవితం..
1994లో డానీ మినోగ్ ను వివాహం చేసుకున్నారు. అయితే 1995లోనే విడాకులు తీసుకోవడం జరిగింది.. ఆ తర్వాత 1999లో బ్రూక్ బర్న్స్ అనే అమ్మాయితో వివాహం జరగగా.2001లోనే విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి కెల్లీ పానీయాగువా తో 2014లో ఏడడుగులు వేశారు.