E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్డేట్.. క్షేమంగా ఉన్నాడంటూ పోస్ట్!

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్డేట్.. క్షేమంగా ఉన్నాడంటూ పోస్ట్!
Advertisement

Chiranjeevi: పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈయన సైనస్ సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగిందనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంపై సమాచారం అందజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఎవరు ఆందోళన చెందవద్దు..

ఈ నేపథ్యంలోనే చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. కళ్యాణ్ బాబుకు విజయవంతంగా సర్జరీ పూర్తి అయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని క్షేమంగా ఉన్నారని తెలియజేశారు. వైద్యుల సూచనల ప్రకారం పవన్ కళ్యాణ్ సాధారణ స్థితికి రావడానికి ఒక వారం రోజుల సమయం పడుతుందని, వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని తెలియజేశారు. ఎవరు కూడా పవన్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.

మీ ప్రార్థనలకు ధన్యవాదాలు..

Advertisement

పవన్ ఆరోగ్యం గురించి మీరందరూ చూపిస్తున్న ప్రేమ మద్దతు, తను క్షేమంగా ఉండాలని మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సమాచారం ఇవ్వటమే కాకుండా ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పడంతో అభిమానులు ఊపిరిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ సర్జరీ జరిగిందనే విషయం తెలియడంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి వారు పవన్ ఆరోగ్యం పట్ల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ సైతం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరగడంతో త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ శుక్రవారం తన రాజకీయ కార్యకలాపాలలో భాగంగా అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు అయితే ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో తన కార్యకలాపాలు రద్దు చేసుకొని వెంటనే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సర్జరీ కారణంగా పవన్ కళ్యాణ్ ఒక వారం రోజులపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండబోతున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తరచు అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది వరకులాగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తరచు అనారోగ్యానికి గురి అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతూ పవన్ కళ్యాణ్ ఇకపై యాక్టివ్ గా సినీ రాజకీయాలలో కొనసాగగలరా అంటూ సందేహాలను తెలియజేస్తున్నారు.

Also Read: అత్యున్నత పురస్కారం అందుకున్న రోజా కూతురు అన్షు మాలిక..

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×