E-Paper
Advertisement

MSVPG Day 1 Collections: మన శంకర వరప్రసాద్ డే 1 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

MSVPG Day 1 Collections: మన శంకర వరప్రసాద్ డే 1 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
Advertisement

MSVPG Day 1 Collections:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ముఖ్యంగా వింటేజ్ చిరంజీవిని చూపించారంటూ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏడుపదుల వయసులో కూడా చిరంజీవిలో ఆ ఎనర్జిటిక్ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదని, చిరంజీవి మరో వందేళ్లయినా ఇలాగే ఉండాలని అభిమానులు ఒకరి తర్వాత ఒకరు మూవీ చూసిన తర్వాత కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సంక్రాంతికి అసలైన పండుగ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతగా ఆడియన్స్ మెప్పు పొందిన ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

మన శంకరవరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్..

జనవరి 12న ఈ సినిమా విడుదలైనా.. మొదటి రోజు అనగా జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తో కలిపి ఇండియాలో 37.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఇందులో సోమవారం 28.5 కోట్లు వసూలు చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్ , పండుగ సీజన్ తో పాటు సినిమాకి పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే పండక్కి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అటు చిత్ర బృందం కూడా ఆశిస్తోంది.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా విశేషాలు..

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం చిరంజీవితో ఈ సినిమా చేశారు. అలాగే ఇందులో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్ర పోషించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్ గా నటించింది. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ALSO READ:VK Naresh: మళ్లీ పెళ్లిపై నరేష్ షాకింగ్ కామెంట్స్.. మరీ ఇలా తయారయ్యారేంటి?

ప్రభాస్ నానమ్మ చిరంజీవికి తల్లిగా..

Advertisement

ఇకపోతే ఇటీవల ఇదే సంక్రాంతి పండక్కి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ కి నానమ్మ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వహాబ్ నటించారు. అలా ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కి నానమ్మగా నటించిన జరీనా వహాబ్ మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవికి తల్లిగా నటించడం విశేషం. ఇక ఈమెతోపాటు శరత్ సక్సేనా, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, అభినవ గోమటం, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

అమితాబ్ కి సర్జరీ.. ఎంత పెద్ద తోపైనా ఓటమి తప్పదంటూ పోస్ట్!

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

Big Stories

Advertisement
×