BigTV English

Chiranjeevi: కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. 47 ఏళ్ల నట ప్రస్థానానికి పునాది

Chiranjeevi: కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. 47 ఏళ్ల నట ప్రస్థానానికి పునాది

Chiranjeevi: కొణిదెల శివ శంకర వరప్రసాద్.. ఈ పేరు తెలియనివారు ఉండొచ్చు. కానీ, మెగాస్టార్ చిరంజీవి తెలియనివారు ఉండరు. కానీ, ఆ పేరు నుంచి ఈ పేరు తెచ్చుకోవడానికి ఆయన  ఒక యుద్ధమే చేశారు అని చెప్పొచ్చు. ఎన్నో నిద్రలేని రాత్రులు.. అవమానాలు, అడ్డంకులు.. విమర్శలు.. ఇవన్నీ ఎదుర్కొని నిలబడిన  ఆ ధైర్యం పేరే చిరంజీవి.


చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. విలన్ గా మారి నెమ్మదిగా సెకండ్ హీరో, హీరో, స్టార్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ గా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించారు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులకు ఆదర్శంగా నిలిచారు. ఇక మెగాస్టార్ లాంటి వృక్షం నీడన ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఈ కొణిదెల శివ శంకర వరప్రసాద్ 47 నట ప్రస్థానానికి పునాది వేసిన రోజు ఈరోజు.

చిరు నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజైన రోజు. దీంతో చిరు తన 47 ఏళ్ళ నటప్రస్థానాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. 22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ.. మీ చిరంజీవి’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


నిజం చెప్పాలంటే కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను అనే మాటను ఫ్యాన్స్ చిరు నోటా నుంచే వేరేలా వినాలనుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి  ముఖ్యమంత్రిగా ఆయన అలా పదవి స్వీకారం చేస్తే వినాలని ఆశపడ్డారు. ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి చిరు కూడా అభిమానుల కోరికను తీర్చాలనుకున్నారు. కానీ, ఈ రాజకీయాలు ఆయనకు పడవని మధ్యలోనే తెలుసుకొని వెనుతిరిగారు. ఏదిఏమైనా ఇలా అయినా ఆయన నోటి నుంచి ఈ పదం వినడం చాలా ఆనందంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక చిరు కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా మారారు.  విశ్వంభర సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. అనిల్ రావిపూడి తో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా సెట్స్ మీద ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ అవుతుంది. ఇక ఈ రెండు కాకుండా బాబీతో చిరు మరో సినిమాను పట్టాలెక్కించాడు. వాల్తేరు వీరయ్య తరువాత ఈ కాంబో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

OG Trailer: పేల్చిపడేస్తాం… ట్రైలర్ లేట్ అయితే సారీ చెప్పలేదు.. కానీ, బాగా కవర్ చేశారు!

 Kalki2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో

Venky – Trivikram: వెంకీ మామ టైం వచ్చేసింది… గురూజీ పక్కా ప్లాన్‌

Aamir Khan: మల్టీప్లెక్స్ తీరుపై మండిపడిన అమీర్ ఖాన్… పద్ధతి మార్చుకోవాలంటూ!

Sujeeth: ఆయన వల్లే ఈ స్థాయి.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్!

Kamal Haasan: సభలకు వచ్చే వాళ్లంతా ఓటేయరు.. హీరో విజయ్‌కి కమల్‌ కౌంటర్‌!

Avika Gor: పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిన్నారి పెళ్ళికూతురు.. ముహూర్తం ఫిక్స్!

Big Stories

×