Kamal Comments on Vijay Rally: వచ్చే ఏడాది తమిళనాడులో ఆసెంబ్లీ ఎన్నికలు జరగున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనాల్లో గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 2026 ఎన్నికల్లో హీరో విజయ్ కూడా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికీ దీనికి విజయ్ సన్నద్దమవుతున్నాడు. తన పార్టీని పేరును తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడిగా మార్చి.. కేంద్ర ఎన్నికల కమిషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తరచూ సభలు నిర్వహిస్తూ.. ప్రజల్లో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక విజయ్ నిర్వహించే సభలకు కూడా ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
ఎక్కడ ఏ సభ నిర్వహించిన వేల సంఖ్యలో జనాలు తరలివస్తున్నారు. ఇక మొదటి సభకు అయితే ఏకంగా 25 లక్షలకు పైగా జనం హాజరయ్యారు. ఇలా ఇసుకవేస్తే రాలనంత జనం విజయ్ సభలో కనిపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కమల్ మాత్రం కూల్గా కౌంటర్ విసిరారు. లోకనాయకుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పాలిటిక్స్లోకి వచ్చే వాళ్లందరికి ఆయన స్వీట్ కౌంటర్ ఇచ్చారు. విజయ్ సభలను ఉద్దేశిస్తూ ఆయన తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
ఇంతకి అసలేం జరిగిందంటే.. తాజాగా కమల్ హాసన్ చెన్నైలో జరిగిన మీడియాలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన సినిమాలతో పాటు పొలిటికల్ ఎజెండాపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో కమల్కు విలేకరుల నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ వరుస సభల గురించి ఆయన అభిప్రాయాన్ని అడగ్గా.. ‘కమల్ ఇలా స్పందించారు. సభలకు వచ్చే జనాలను చూసి భ్రమ పడోద్దు. సమావేశానికి వచ్చిన జనాలంత ఓటు వేయరు. ఈ వాస్తవాన్ని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి‘ అని కమల్ హితవు పలికారు. అయితే ఈ సూత్రం కేవలం విజయ్కి మాత్రమే కాదని, తనకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వస్తున్న విజయ్ కి ఆయన ఇచ్చే సూచన ఏంటని అడగ్గా.. ధైర్యంగా మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. ఈ విజ్ఞప్తి అందరు నాయకులకు కూడా అన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఇటీవల తిరువారూర్‌లో జరిగిన ఓ సభలో విజయ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సభకు ఇంతమంది వస్తున్నారు.. కానీ, ఓట్లు వేసేది ఎంతమంది అని ప్రశ్నిస్తున్నారు. వారంత ఓట్లే వేయరంటున్నారు. ఇది నిజమేనా ని ప్రజలు ఉద్దేశిస్తూ ప్రసింగించాడు. విజయ్ అన్న ఈ మాటలు సభలోని వారంత విజయ్ విజయ్ అని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు.