BigTV English

Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ ఇటీవల కాలంలో మరొక సినిమాలో క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించే ప్రేక్షకులను సందడి చేశారు. అలాగే నాగార్జున కూలీ, కుబేర వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక బాలయ్య సినిమాలో కూడా వెంకటేష్ నటించబోతున్నారని, చిరంజీవి సినిమాలో కూడా వెంకటేష్ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.


పాన్ ఇండియా స్థాయిలో స్పిరిట్..

ఇదిలా ఉండగా తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) త్వరలోనే ప్రభాస్(Prabhas) హీరోగా స్పిరిట్ (Spirit)అనే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటి త్రిప్తి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే.


స్పిరిట్ సినిమాలో భాగం కానున్న మెగాస్టార్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి పోషించే పాత్ర చాలా కీలకమైన పాత్ర కావడంతో మెగాస్టార్ అయితేనే ఈ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసినట్టు ఉంటుందని అందుకే మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

క్యామియో పాత్రలో చిరంజీవి…

ఇలా మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే కచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఈ చిత్రం చిరస్థాయిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు మన శివశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా ఒకవైపు హీరోగా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు క్యామియో పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలిసిన ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Lavanya Tripati: బేబీ బంప్ తో వినాయకుడి పూజలో మెగా కోడలు!

Related News

Allu Arjun: ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాలతో మీటింగ్

Srikanth iyengar : ముదిరిన వివాదం, శ్రీకాంత్ అయ్యంగార్ పై మా అసోసియేషన్ కు పిర్యాదు

Andhra King Taluka Teaser : అందరు ఫ్యాన్స్ కి టచ్ అయ్యే డైలాగ్ , ఇకనైనా మారుతారా?

Film industry: ప్రముఖ నటి, ఆస్కార్ గ్రహీత కన్నుమూత!

Siddu Jonnalagadda: లవ్ స్టోరీని బయటపెట్టిన సిద్దు..ఆ తప్పు వల్లే దూరం?

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఆ సినిమా బ్యాన్..?

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Big Stories

×