BigTV English

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా,  వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

BLACKPINK Lisa: సౌత్ కొరియాకు చెందిన బ్లాక్ పింక్ మెంబర్ లిసా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ పాప్ బ్యూటీ చేసే ప్రతి పని సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఆమె తినే తిండి నుంచి ఉపయోగించే దుస్తుల వరకు, వేసుకునే చెప్పుల నుంచి ఆడుకునే బొమ్మల వరకు బాగా పాపులర్ అవుతాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మమ లండన్ లో పర్యటించింది. ఈ సందర్భంగా థాయ్ లాండ్ స్పెషల్ డిష్ అయిన హాట్ యాయ్ ఫ్రైడ్ చికెన్ టేస్టీ ఆస్వాదించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పండుకుంది. ఆమె ఆ వీడియోను ఇలా షేర్ చేసిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ థాయ్ వంటకం ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది.


ఇంతకీ ఏంటీ హాట్ యాయ్ ఫ్రైడ్ చికెన్?

హాట్ యాయ్ ఫ్రైడ్ చికెన్ అనేది థాయ్‌ లాండ్‌ కు చెందిన ప్రసిద్ధ వంటకం, ఇది రుచికరమైన మసాలాలతో కూడిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్‌ గా పిలువబడుతుంది.  చికెన్ సుగంధ ద్రవ్యాలలో మ్యారినేట్ చేయబడి, బియ్యం పిండిలో పూత పూయబడుతుంది. ఆ తర్వాత క్రిస్పీగా అయ్యే వరకు డీప్-ఫ్రై చేయబడుతుంది. దీనిని తరచుగా స్టిక్కీ రైస్, స్వీట్ చిల్లీ సాస్‌ తో కలిపి తింటారు. ఎంతో రుచికరంగా ఉంటుంది.  లిసా ఈ వంటకాన్ని ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది దీనిని రుచి చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు థాయ్ రెస్టారెంట్ యజమానులు లిసా తమ చికెన్ కు ప్రమోట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కొంతకాలం క్రితం లబుబు బొమ్మను ప్రమోట్ చేసిన లిసా

లిసా గతంలో లబుబు అనే బొమ్మ గురించి సోషల్ మీడియాలో వివరించింది. ఈ బొమ్మ పట్ల ఆమెకున్న అభిమానం గురించి చెప్పింది. కాసేపట్లోనే ఆ బొమ్మ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎక్కడ లేని క్రేజ్ లభించింది.  లిసా సోషల్ మీడియాలో ఈ బొమ్మ ఫోటోలు, వీడియోలను పంచుకున్నప్పుడు..  ప్రజలు తమ సాధారణ మృదువైన బొమ్మలను వదిలివేసి లబుబును కొనడానికి ఆసక్తి చూపించారు. ఆ తర్వాత పాప్ సంస్కృతిలో సంచలనంగా మారింది.   లబుబు మాదిరిగానే, ఇప్పుడు థాయిలాండ్ హాట్ యాయ్ ఫ్రైడ్ చికెన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.   ఈ వంటకం గురించి లిసా ప్రచారం చేయడం పట్ల నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. “ఆమెకు అద్భుతమైన రుచి ఉందని ప్రజలకు తెలుసు. అందుకే, ఆమె ఏమి తిన్నా, ధరించినా, ఉపయోగించినా, ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనుసరిస్తున్నారు” అని ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ ఎవరీ లిసా?

లిసా పూర్తి పేరు లలిసా మనోబన్. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ K-పాప్ గర్ల్ గ్రూప్ బ్లాక్‌ పింక్ సభ్యురాలు. ఆమె థాయ్‌ లాండ్‌ లో 1997 మార్చి 27న జన్మించింది. థాయ్‌లాండ్ నుండి వచ్చిన మొట్టమొదటి K-పాప్ స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రూప్‌ లో లీడ్ ర్యాపర్. సబ్-వోకలిస్ట్, మెయిన్ డాన్సర్‌ గా పనిచేస్తుంది. లిసా తన అద్భుతమైన డాన్స్ టెక్నిక్స్, పవర్ ఫుల్ ర్యాప్‌ లు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ఆమె విడుదల చేసిన పలు ఆల్బమ్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. పలు ఫ్యాషన్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతోంది.

Read Also: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

Related News

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

DMart: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

Big Stories

×