Chiranjeevi Megaverse:మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరు చెబితే బాక్సాఫీస్ పులకరిస్తుంది.ఈ మాట వింటే అభిమానులకి పూనకాలు వచ్చేస్తాయి. ఇక వెండితెరపై ఈయన కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి.అలా దాదాపు యాబయి ఏళ్లుగా తెలుగు ప్రజలని తనదైన సినిమాలతో అలరించిన చిరు ఇపుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి రెడీ అయిపోయారు.
అవును ..తాజాగా చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో వచ్చిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవడమే కాకుండా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ పోస్టర్‌లో చిరు స్టైలిష్‌గా కళ్లద్దాలు కొంచెం కిందకు జరిపి, తనదైన చిరునవ్వుతో అదరగొట్టేశాడనే చెప్పాలి.
దానికి తోడు “ఇది నా అడ్డా” అంటూ పెట్టిన క్యాప్షన్ బట్టి చూస్తే వెండితెరని తన అడ్డాగా చేసుకొని ఎన్నో ఏళ్లపాటు ఏలిన చిరు ఇపుడు డిజిటల్ వరల్డ్ లోనూ తన సత్తా చూపించబోతున్నాడని అర్థమవుతుంది.ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో రాబోతుందన్న పోస్టర్ రివీల్ తో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇక అసలు విషయానికి వస్తే . చిరంజీవి మొట్టమొదటిసారిగా డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ నిర్వహించే ఒక టాక్ షోకు హోస్ట్‌గా మారబోతున్నారు. అయితే ఈ షోలో కేవలం సినిమా వాళ్లే కాకుండా స్పోర్ట్స్, పాపులర్ కల్చర్‌కు చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా రాబోతుండటం విశేషం .
ఇక వారంతా చిరుతో కలిసి కూర్చుని తమ జీవితంలోని సీక్రెట్స్, మర్చిపోలేని అనుభవాలను షేర్ చేసుకోబోతున్నాట కూడా.ఇక ఈ ప్రోగ్రామ్‌ను ‘మెగా నాస్టాల్జియా.. మెగా నవ్వులు.. మెగా ముచ్చట్లు’ అనే సూపర్ కాన్సెప్ట్‌తో ప్లాన్ చేశారని తెలుస్తుంది.
అంటే రొటీన్‌గా ప్రశ్నలు అడగడం, వాళ్లు సమాధానాలు చెప్పడం లాంటి బోరింగ్ ఫార్మాట్ కాకుండా.. సెలబ్రిటీల లైఫ్‌లోని పాత జ్ఞాపకాలు, కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు, షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ ఇందులో బయటకు రాబోతున్నాయన్న మాట.
పైగా ఈ షో కోసం నెట్‌ఫ్లిక్స్ చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ కూడా భలే క్రియేటివ్‌గా వర్కవుట్ అయిందనే చెప్పాలి. మొదటగా హైదరాబాద్ అంతా పెట్టిన హోర్డింగ్స్‌లో చిరంజీవి పేరులో ‘N’ అక్షరాన్ని మిస్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేయగా ,ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోలో ఆ మిస్ అయిన అక్షరం నెట్‌ఫ్లిక్స్‌ది అని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ఇక ఆ వీడియో చివర్లో బాస్ తన బేస్ వాయిస్‌తో చెప్పిన “ఇది నా అడ్డా” డైలాగ్ అయితే ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో సందేహం లేదు.
ఇక ఈ షోను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ సంస్థలు కలిసి గ్రాండ్‌గా నిర్మిస్తుండగా ,ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయిందని నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది కూడా .
అయితే ఈ షో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? మొదటి ఎపిసోడ్‌లో గెస్ట్‌లుగా ఎవరెవరు రాబోతున్నారు? అనే విషయాలను ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచారు మేకర్స్ .చూడాలి మరి ఇన్నాళ్లూ వెండితెరపై తన డ్యాన్సులతో, ఫైట్లతో మెస్మరైజ్ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో ఎన్ని సంచలనాలు స్పృష్టిస్తాడో !